ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ సందడి

ABN, Publish Date - Jul 05 , 2025 | 01:15 AM

కాంగ్రెస్‌ పార్టీలో ఇక నామినేటెడ్‌ పదవుల జాతర ప్రారంభం కానున్నది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే వెంటనే ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు నామినేటెడ్‌ పదవుల్లో భర్తీ చేయదలచిన నేతల పేర్లను ముఖ్యమంత్రికి అందజేయాలని ఆదేశించ డంతో ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్న మార్కెట్‌ కమిటీలు, వివిధ కార్పొరేషన్ల, దేవాల యాల కమిటీలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు, గ్రంథాలయ సంస్థలు, ఆత్మ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్‌ పోస్టుల పదవులకు మోక్షం లభించనున్నది.

- ఖర్గే ఆదేశాలతో భర్తీకానున్న పదవులు

- ఆశావహుల్లో కొత్త ఉత్సాహం

- స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయం

- మార్కెట్‌, కార్పొరేషన్‌, ఆలయ పదవులకు మోక్షం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ పార్టీలో ఇక నామినేటెడ్‌ పదవుల జాతర ప్రారంభం కానున్నది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే వెంటనే ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు నామినేటెడ్‌ పదవుల్లో భర్తీ చేయదలచిన నేతల పేర్లను ముఖ్యమంత్రికి అందజేయాలని ఆదేశించ డంతో ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్న మార్కెట్‌ కమిటీలు, వివిధ కార్పొరేషన్ల, దేవాల యాల కమిటీలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు, గ్రంథాలయ సంస్థలు, ఆత్మ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్‌ పోస్టుల పదవులకు మోక్షం లభించనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో గానే ఈ పదవుల భర్తీ చేయాలని ఖర్గే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఈ ప్రక్రియ పెండిం గ్‌లో పడే అవకాశమే లేదని భావిస్తున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులకు, డీసీసీ అధ్యక్షులకు, ఇతర ముఖ్య నేతలకు మధ్య ఏమైనా విబేధాలున్నా సర్దుకుని సమన్వయంగా నామినేటెడ్‌ పదవులకు ప్రతిపాదనలు పంపించాలని ఖర్గే ఆదేశించారు. స్థానికంగా గ్రామీణ స్థాయిలో ఉండే శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు నామినేటెడ్‌, పార్టీ పదవులను పొందడం ద్వారా ఉత్సాహంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం చేకూర్చిపెడతారని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నది. అందుకే స్పష్టమైన ఆదేశాలిచ్చి నామినేటెడ్‌ పదవుల భర్తీకి పూనుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుని ఆదేశాలతో జిల్లాలో ఇక ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావించారు.

ఫ ఏడాదిన్నరగా ఎదురుచూపులు

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా జిల్లాలో నామినేటెడ్‌ పదవులుకానీ, పార్టీ పదవులు కానీ కట్టబెట్టలేదు. కేవలం ముగ్గురు, నలుగురు నాయకులకు మాత్రమే ఆ పదవులు అందివచ్చాయి. ఆ భర్తీ అయిన పదవులే జిల్లాలో నాయకుల మధ్య విబేధాలను మరింత పెంచి ఇక మరేపదవులు భర్తీకాని పరిస్థితికి కారణమయ్యాయి. శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) అధ్యక్షునిగా కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డిని నియమించారు. ఈ నియామకం వెనుక మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారని, ఆయన సన్నిహిత అనుచరుడు కావడంతోనే ముఖ్యమంత్రి ఈ నియామకాన్ని చేశారని జిల్లాకే చెందిన మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ అసంతృప్తికి లోనయ్యారు. పదవి పొందిన తర్వాత నరేందర్‌ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలవడానికి వెళ్లగా ఆయన అందుకు నిరాకరించారని, ఆ తర్వాత కూడా మంత్రి పాల్గొనే కార్యక్రమాల సమాచారం కూడా నరేందర్‌రెడ్డికి ఇవ్వడం లేదని కలిసి వేదిక పంచుకున్న సందర్భాలు కూడా లేవని పార్టీలో బాహాటంగానే చర్చించుకుంటున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన సత్తు మల్లేశం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి అనుచరుడిగా ఈ నియా మకాన్ని పొందగా దానిపట్ల కూడా మంత్రి పొన్నం ప్రభాకర్‌ అసంతృప్తికి లోనయ్యారని చెబుతు న్నారు. పడాల రాహుల్‌కు ఆర్‌టీఏ సభ్యునిగా, యాగండ్ల అనిల్‌కుమార్‌ను అయ్యప్పస్వామి ఆలయ చైర్మన్‌గా నియమించారు. ఈ ఇద్దరు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశీస్సులతో పదవులను పొందారు.

ఫ విబేధాలతో పెండింగ్‌

మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియ మించినా కరీంనగర్‌ నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో ఉండే ప్రధాన మార్కెట్‌ కమిటీకి చైర్మన్‌గాని, సభ్యులుగాని లేకుండా పోయారు. అలాగే పలు దేవాలయాలు, ఇతర కమిటీల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. కరీంనగర్‌ నియోజకవర్గంపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తుండడంతో ఇక్కడ నామినేటెడ్‌ పదవులు ఎవరికి దక్కలేదని అంటున్నారు. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే ఇప్పుడు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో ఆ పరిస్థితికి తెరపడుతుందని, త్వరలోనే నామినేటెడ్‌ పదవులు, పార్టీ పదవులు లభిస్తాయని ద్వితీయ శ్రేణి నేతలు, క్రియాశీల కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. గతంలో నామినేటెడ్‌ పదవుల విషయంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, నగర అధ్యక్షుడిగా ఉన్న సుడా చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి కొన్ని పదవుల విషయంలో ఆనాటి జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ప్రతిపాదనలు ఇచ్చినా మంత్రుల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేక పెండింగ్‌లో ఉంచారని ప్రచారం జరిగింది. కరీంనగర్‌ నియోజక వర్గానికి నామినేటెడ్‌ పదవుల విషయం అటుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ముందుకు సాగడానికి క్రియాశీలపాత్ర వహించే ఇందిరమ్మ కమిటీల నియామకం కూడా కాకుండా పోయింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లు జరుగుతున్నా కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికీ ఎవరికి ఇళ్లు మంజూరు కాని పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడైనా ఈ పరిస్థితిపోయి నామినేటెడ్‌ పదవుల వ్యవహారం కొలిక్కి వస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం కూడా పరిష్కారమవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 01:15 AM