ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధిహామీలో కొత్త పనులు

ABN, Publish Date - Jun 29 , 2025 | 01:19 AM

ఉపాధిహామీ పథకం కింద వర్షాకాలంలో కూలీలతో పలు రకాల పనులు చేయించే విధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. జాబ్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబం వంద రోజుల పనులను సద్వినియోగం చేసుకునేలా అధికారులు, సిబ్బంది ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పించారు.

జగిత్యాల, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం కింద వర్షాకాలంలో కూలీలతో పలు రకాల పనులు చేయించే విధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. జాబ్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబం వంద రోజుల పనులను సద్వినియోగం చేసుకునేలా అధికారులు, సిబ్బంది ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పించారు. కొత్త పనులకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు ఇవ్వాలని రైతులను కోరారు. అయితే కూలీలు ఎంతగా పెరిగితే అంత నిధులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. మ్యాన్‌ డేస్‌ పెరిగితేనే ఇతర నిర్మాణలకు నిధులు ఇచ్చే విధంగా ఈ పథకం రూపకల్పన చేశారు.

ఫఈజీఎస్‌లో చేపట్టే పనుల వివరాలు...

పంట కాల్వలు, చేపల చెరువు, ఇంకుడుగుంతలు, కంపోస్ట్‌ ఎరువు, పంట పొలాలకు రోడ్ల నిర్మాణం, మొక్కలు పెంచడంతో పాటు పండ్ల తోటలు, కొబ్బరి మొక్కలు, పామాయిల్‌ మొక్కల పెంపకం, మునగ, జామ, బత్తాయి, మామిడి, సపోట, వెదురు వనం పెంచడం, మేకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల ఫారాల నిర్మాణం చేపడతారు. ఇవేకాకుండా మరో 18 రకాల పథకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పనులు రైతులకు అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయంలో మేలు జరుగుతుంది. భూమి చదునుతోపాటు వివిధ పథకాలను వర్తింప చేసేందుకు ఈజీఎస్‌ అధికారులు పల్లెబాట పడుతున్నారు. పంట కాల్వలతో చెరువుల నుంచి నీటిని పొలాలకు పంపించడం, చెరువుల పూడిక తీతతో నీటి నిల్వలు, పాంఫాండ్‌తో పొలాల చదును, ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు పెరుగుదల, నాడవు కంపోస్ట్‌తో పంట పొలాలకు సేంద్రియ ఎరువు లభిస్తుంది. మేకలు, గొర్రెల, గేదెల పెంపకానికి షెడ్ల నిర్మాణాలు ఈ పథకంలో చేపట్టనున్నారు.

ఫకూలీలకు ఆర్థిక ప్రయోజనం

ఉపాధిహామీ పథకం ద్వారా ఒక్కో కుటుంబం వంద రోజుల పాటు పనులు చేసుకుంటే సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. దీంతో కుటుంబాలు ఆర్థిక అభివృద్థితో పాటు సామాజికంగా ఎదిగేందుకు దోహద పడుతుంది. క్యూబిక్‌ మీటర్‌ చొప్పున లెక్క గట్టి ఉపాధి కూలీలకు కూలిని అందజేస్తారు. దీంతో వారి ఇంటిల్లి పాది పూట గడవడంతో పాటు అవసరాలను తీర్చుకుంటున్నారు.

ఈజీఎస్‌ కూలీలకు మరింత ఉపాధి

-రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఉపాధి కూలీలకు మరింత ఉపాధిని ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఉపాధిహామీ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రజలను, రైతులను భాగస్వాములను చేస్తున్నాం. దీంతో రైతులకు ఉపయోగపడే పథకాలతో వారి ఆర్థిక అభివృద్ధికి దోహద పడుతుంది.

----------------------------------------------------------------------------------------------------

జిల్లా సమాచారం

మొత్తం గ్రామ పంచాయతీలు..380

జాబ్‌ కార్డులు...1.67 లక్షలు

మొత్తం కూలీల సంఖ్య..2.73 లక్షలు

----------------------------------------------------------------------------------------------------

Updated Date - Jun 29 , 2025 | 01:19 AM