ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతిపక్ష పార్టీలపై నజర్‌

ABN, Publish Date - Jul 24 , 2025 | 02:29 AM

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై నజర్‌ వేసింది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై నజర్‌ వేసింది. వారి కదలికలపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఆయా పార్టీల్లో ఎవరెవరు చేరుతున్నారనే విషయమై సమాచారం సేకరిస్తున్నారు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల నుంచి గట్టిగా పోటీనిచ్చే నాయకులు ఎవరు ఉన్నారనే విషయమై కూడా ఆరా తీస్తున్నారు. సెప్టెం బర్‌ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన మేరకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ముందుగా ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో, మండల, జిల్లా పరిషత్‌ పాలక వర్గాల పదవీ కాలం గత ఏడాది జూలై మాసంలో, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో కులగణన సర్వే చేపట్టింది. ఆ సర్వేలో బీసీలే అధికంగా ఉన్నారని తేలింది. కుల గణన సర్వేకు ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందింది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులను ఆమోదించారు. ఆ బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. అయితే ఈ బిల్లులు ఇప్పట్లో ఆమోదం పొందే అవకాశాలు లేకపోవడంతో 15 రోజుల క్రితం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఆర్డినెన్స్‌ తీసుకరావాలని నిర్ణయించి రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. ప్రస్తుతం ఆయన పరిశీలనలో ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కల్పించక పోయినా తప్పనిసరిగా సెప్టెంబర్‌లోగా ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫ పార్టీల బలాబలాలపై ఆరా..

రిజర్వేషన్ల పరిస్థితి ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల బలా బలాలు ఎలా ఉన్నాయనే విషయమై అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ఆరా తీస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అనే విషయమై కూడా తెలుసుకుంటున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అభ్యర్థులే మెజారిటీ స్థానాల్లో గెలుపొందుతారు. కానీ ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుండడంతో పార్టీ పట్ల ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా, లేదా అని కూడా ఆరా తీస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో తొమ్మిదన్నరేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల గ్రాఫ్‌ ఎలా ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో ఏ పార్టీలకు చెందిన అభ్యర్థులు బలంగా ఉన్నారు. వారికి ప్రజల్లో బలం ఉంది, వాళ్లు అదే పార్టీలో ఉంటారా, పార్టీ మారే ఆలోచన ఉందా, పార్టీ మారకుంటే అదే పార్టీ నుంచి పోటీ చేస్తే, అధికార పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టాలనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు.

ఫ స్థానిక ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కోవాలి

రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, మెజారిటీ స్థానాల్లో తామే గెలుస్తా మనే ధీమాతో కాకుండా పకడ్బందీగా స్థానిక ఎన్నికలను ఎదుర్కోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ గౌడ్‌ భావిస్తున్నారు. ఏ ఎన్నికను కూడా తక్కువ అంచనా వేయకుండా సీరి యస్‌గానే పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో మంథనికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, రామగుండంకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 267 గ్రామ పంచాయతీలు, 13 రూరల్‌ మండలాల్లో 13 జడ్పీటీసీ స్థానాలు, 137 ఎంపీటీసీ స్థానాలు, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటినీ కైవసం చేసుకోవాలని అధికార పార్టీ భావిస్తున్నది. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆయా పార్టీల్లో చేరికలు ఇంకా మొదలు కాలేదు. కాంగ్రెస్‌ పార్టీలోకి పలు పార్టీల నాయకులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రోత్సహించడం లేదు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత పార్టీ అధికా రంలోకి రావడానికి కృషి చేసిన నాయకులకు రిజర్వేషన్లను బట్టి వారికే టిక్కెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మెజారిటీ స్థానాలను కైవ సం చేసుకునేందుకు ఇప్పటి నుంచే అధికార పార్టీ ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా పరిస్థితులపై ఆరా తీస్తున్నది.

Updated Date - Jul 24 , 2025 | 02:30 AM