జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - May 07 , 2025 | 12:42 AM
జాతీయ లోక్ అదాలత్‌ను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ పి. నీరజ అన్నారు.
సిరిసిల్ల క్రైం, మే 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్ అదాలత్‌ను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ పి. నీరజ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కోర్టుహాలు లో జూన్ 9 నుంచి 14వరకు నిర్వహించే ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పోలీసు అధికారులు, జ్యూడిషియల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అత్యధిక కేసుల పరిష్కారానికి కృషిచేయాలన్నా రు. ప్రధానంగా ఎన్‌ఐ యాక్ట్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులతో పాటు రాజీ అయ్యే క్రిమినల్, సివిల్ కేసుల పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇందుకు పోలీసు, జ్యూడిషియల్ అధికారులు సమన్వయంతో కృషి చేస్తే పరిష్కార మార్గానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగ కుండా ఉండేందుకు చివరికి రాజీయే రాజమార్గం అన్నారు. ఈ సమావేశం లో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వా ల్, సినియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జూని యర్ సివిల్ జడ్జిలు ప్రవీణ్, సృజన, మేఘన, లోక్ అదాలత్ సభ్యులు చిం తోజు భాస్కర్, ఆడెపు వేణు, పీపీలు, అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 12:42 AM