ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నూతన సాంకేతికతపై అవగాహన కలిగి ఉండాలి

ABN, Publish Date - Jul 05 , 2025 | 12:40 AM

విద్యార్థులు నూతన టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలని,లక్ష్యా న్ని ఎంచుకొని ఆ దిశగా ప్రయాణించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశా రు.

కోనరావుపేట, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు నూతన టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలని,లక్ష్యా న్ని ఎంచుకొని ఆ దిశగా ప్రయాణించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశా రు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఐదు కోట్లతో అభివృద్ధి పనులకు శుక్రవారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి మంత్రి బండి సంజయ్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్‌కి మార్చి ఫాస్ట్‌, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞా విజ్ఞాన పరికరాల ద్వారా ఏర్పాటు చేసిన పరికరాలను తిలకించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఐ సైన్స్‌ ల్యాబ్‌ను ప్రా రంభించి తరగతిలో విద్యార్థులతో విద్యాభ్యాసన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ప్ర యాణించాలని సూచించారు. ప్రభుత్వం ఏకలవ్య గురు కుల పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను పూర్తిస్థాయి లో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆధునిక సాంకేతికత ద్వారా క్లిష్టమైన సమస్యల పరిష్కారం లభి స్తుందని, నూతన టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండా లని అన్నారు. ఎంపీ నిధులతో సోలార్‌ ప్లాంట్‌ డిజిటల్‌ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 20వేలకు పైగా గిరిజన జనాభా ఉన్న మండలాల్లో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 728 పాఠశాలలు లక్ష్యం కాగా, సుమారు 500 పాఠశాలలను ప్రారంభించగా 1.5లక్షల మంది విద్యార్థులు చదువుకుం టున్నారని పేర్కొన్నారు. ఏకలవ్య పాఠశాలల వ్యవస్థ ప్రధాన లక్ష్యం చదువే కాకుండా క్రీడా, కళ, సాంస్కృతిక రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను ఈ పాఠశాలల ద్వారా సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు సీబీఎస్‌ఈ విధానంతో అత్యున్నతమైన, నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఏకలవ్య పాఠశాలల పథకాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సుమారు 25 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. ఈ పాఠశాలల్లో 1,40,000మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 23పాఠశాలల్లో సుమారు పదివేల మంది విద్యార్థులు ఉన్నారని మొత్తం మూడు లక్షల 80 వేల మంది గిరిజన ఆదివాసి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏకలవ్య రెసిడెన్షియల్‌ మోడల్‌ స్కూల్లో ఐఐటి, జేఈఈ, నీట్‌, ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇస్తున్నారన్నారు. గిరిజన బిడ్డల కు అర్థం కావడం కోసం ప్రాంతీయ భాషలను నేర్పేం దుకు సంబంధిత భాష బోధకులను నియమిస్తున్నామ న్నారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్స హిస్తుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ విజయల క్ష్మి, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ఆర్‌ఎస్‌ యాదవ్‌, బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, అల్లాడి రమేష్‌, రేగుల మల్లికార్జున్‌, ఎర్రం మహేష్‌, సురేందర్‌ రావు, మండల నాయకులు మిర్కాల్‌కార్‌ బాలాజీ, తిరుపతి గౌడ్‌, తిరుపతి, వెలిశాల రవి, మోత్కు మోహన్‌, జింక వెంకటి, జలంధర్‌, సాయి గౌడ్‌, రవీందర్‌ గౌడ్‌, పల్లం అన్నపూర్ణ, అంబోజ లక్ష్మీనారాయణ, అవురం తిరుపతి, ముష్ణం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:40 AM