ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చిన నేత మోదీ

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:36 PM

శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చిన నేత నరేంద్ర మోదీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

భగత్‌నగర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చిన నేత నరేంద్ర మోదీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం కోసం తుదిదాకా పోరాడిన నాయకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ అన్నారు. 370 ఆర్టికల్‌ రద్దు, మేక్‌ ఇన్‌ ఇండియా కోసం పరితపించిన నాయకుడన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటి మేయర్‌ గుగ్గిళ్లపు రమేష్‌, మాజీ కార్పొరేటర్లు బండరమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:36 PM