ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలి
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:54 AM
నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలోని సబ్ డివిజనల్ పోలీస్ అధి కారి కార్యాలయంలో సీసీ కెమెరాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఏఎస్పీ కార్యాలయం ద్వారా మానిటర్ చేయడం మంచి విషయం అన్నారు. కిడ్నాప్‌లు, దొంగతనాలు వంటి ఘటనలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను త్వరగా పట్టుకుంటున్నార ని, సీసీ కెమెరాలతో పాటు ఆధునిక సాంకేతికతను మరింత విరివిగా ఉపయో గించుకోవాలని ఆయన సూచించారు. రుద్రంగి పోలీసు స్టేషన్ భవన నిర్మాణం కోసం రెండున్నర కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీసు స్టేషన్, జిల్లా కేంద్రంలో మహిళా, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇబ్బం దులు కలగకుండా ఉండేందుకే క్యాంప్ కార్యాలయాన్ని డీఎస్పీ కార్యాలయనికి అప్పగించామని, భవిష్యత్తులో ఈ భవనాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉపయోగించుకుంటామని అన్నారు. పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణం లో రాత్రి 11-30 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేలా చూడాలని సూచిం చారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో స్నేహపూర్వకంగా మెదలాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏఎస్‌పీ శేషాద్రినిరెడ్డి, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, టౌన్ సీఐ వీరప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 27 , 2025 | 12:54 AM