ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చీప్‌ పబ్లిసిటీ కోసం సీఎంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 27 , 2025 | 12:13 AM

చీప్‌ పబ్లిసిటీ కోసం ముఖ్యమంత్రిపై హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం విమర్శించారు.

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): చీప్‌ పబ్లిసిటీ కోసం ముఖ్యమంత్రిపై హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం కరీంనగరలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఫోన్‌ టాపింగ్‌కు శ్రీకారం చుట్టిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. ఇటువంటి బీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డిపై నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కౌశిక్‌రెడ్డి ముఖ్యమంత్రికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి. కర్ర రాజశేఖర్‌, పులి ఆంజనేయులుగౌడ్‌, బోనాల శ్రీనివాస్‌, బెజ్జంకి మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఫ క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సీపీకి ఫిర్యాదు

సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీ గౌస్‌ ఆలంకు శనివారం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ఫిర్యాదు చేశారు. హుందాగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే సీఎంపై అసత్య, నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టప్రకారం క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరారు.

Updated Date - Jul 27 , 2025 | 12:13 AM