Minister Uttam: అందరికీ ఇస్తాం.. కంగారు పడొద్దు: మంత్రి ఉత్తమ్..
ABN, Publish Date - Jan 22 , 2025 | 02:08 PM
కరీంనగర్: అర్హులందరికీ రేషన్ కార్డులు(Ration Cards) ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) భరోసా ఇచ్చారు. పేదలందరికీ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవ్వరూ భయపడొద్దని మంత్రి చెప్పారు.
కరీంనగర్: అర్హులందరికీ రేషన్ కార్డులు(Ration Cards) ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) భరోసా ఇచ్చారు. పేదలందరికీ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవ్వరూ భయపడొద్దని మంత్రి చెప్పారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు (Manakonduru) గ్రామసభలో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తులు అన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈరోజు దరఖాస్తు ఇచ్చినా రేషన్ కార్డు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా జనవరి 21 నుంచి గ్రామసభలు ప్రారంభమయ్యాయి.
Khammam: రోల్ మోడల్‌గా నిలుస్తున్న కలెక్టర్.. ఆయన చేస్తు్న్న పనులకు సెల్యూట్ చేయాల్సిందే..
గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈనెల 24 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. కాగా, ఈనెల 26న నుంచి అర్హులకు రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయనుంది. గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేసింది. ఈ సర్వేలో చాలామంది తమకు రేషన్ కార్డులు లేవని ఎన్యూమరేటర్లకు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్యూమరేటర్లు పైఅధికారులకు చెప్పారు. అయితే తొలుత అంతా కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తారని భావించారు. కానీ గ్రామసభలు పెట్టి నూతన కార్డులు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. ఈ మేరకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
Gunfire: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసు.. పోలీసుల పురోగతి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 02:08 PM