ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponnam.. ఆ నేతలకు కులగణన దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం

ABN, Publish Date - Feb 11 , 2025 | 12:39 PM

కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కులగణనపై ఆ పార్టీలు చేస్తున్న కామెంట్స్ సరికాదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మైనార్టీలను ఇప్పుడు కొత్తగా బీసీల్లో చేర్చలేదని.. మైనార్టీలు ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్నారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

Minister Ponnam Prabhakar

కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కులగణన దరఖాస్తులను (Caste Census Applications) బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR), మాజీ మంత్రులు (Ex Ministers) కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao)లకు పంపారు. ఈ సందర్బంగా మంగళవారం కరీంనగర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముందు మీరు కుల గణనలో పాల్గొని.. అప్పుడు మాట్లాడాలన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ, బిఆరెస్‌కు బీసీల పట్ల చిత్త శుద్ధి ఉందా.. చేతగకపోతే నోరు మూసుకుని కూర్చోవాలన్నారు. కులగణనపై బీజేపీ కుట్ర చేస్తోందని.. సూచనలు, సలహాలు ఇస్తే తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

ఈ పథకాన్ని సమర్ధవంతంగా వాడుకోవాలి


మైనార్టీలను ఇప్పుడు కొత్తగా బీసీల్లో చేర్చలేదని.. మైనార్టీలు ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్నారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రంతో దేశ వ్యాప్తంగా కుల సర్వే చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే.. బీసీ సమాజం బాధపడిందని అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట కవిత లిక్కర్ నినాదం అయి పోయిందని, ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారని అన్నారు. కవితకు అప్పుడప్పుడు జాగృతి గుర్తుకు వస్తుందని, ఏమీ లేకపోతే బతుకమ్మ నినాదం ఎత్తుకుంటారని, ఆమె ఒక ఆడబిడ్డ.. ఆమెను విమర్శించాలని తమకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.


మంత్రి పొన్నం కోలాటం

కాగా కరీంనగర్‌లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి పద్మానగర్ నుండి మార్కెట్ రోడ్‌లో గల వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే శోభాయాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం కోలాటం ఆడి ఆడారు. డప్పు కళాకారులతో కలిసి దరువేసి చూపరులను ఆకట్టుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..

4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 11 , 2025 | 12:40 PM