సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు..
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:31 AM
వర్షాకాలంలో సీజన ల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో జాగ్రత్తలను చేపట్టాలని, అలాగే పంటలసాగుకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్ట డంతోపాటు రేషన్‌కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలంలో సీజన ల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో జాగ్రత్తలను చేపట్టాలని, అలాగే పంటలసాగుకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్ట డంతోపాటు రేషన్‌కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాతో సమీక్షించారు. జూలై 25నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మండల కేం ద్రాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయాలన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నా రు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకో వడంతోపాటు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వ్యవసాయ పను లు సజావుగా జరిగేందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు రైతుల కు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే నీటిపారుదల శాఖ ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్నారు. జిల్లాలో కలెక్టర్ క్షేత్రస్థా యిలో తనిఖీలు చేపట్టాలన్నారు. ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసి పనితీరు పర్యవేక్షించాలని కోరారు. అత్యవసర సమయంలో కలె క్టర్ ఖర్చు చేసేందుకు నిధులు కూడా అందుబాటులో పెట్టడం జరు గుతుందన్నారు. జిల్లాలో ఎరువుల స్టాక్ ఎంత అందుబాటులో ఉందో కలెక్టర్ రెగ్యూలర్‌గా ప్రకటనలు విడుదల చేయాలన్నారు. ప్రతి అసెం బ్లీ నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పాల్గొనేలా కలె క్టర్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధి కారికి భాధ్యతలు అప్పగించాలన్నారు.
సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లను ఏర్పాటుచేయాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల మండలాల చెక్‌పోస్ట్‌లను ఏర్పా టు చేయాలని ఆర్డీవోలను కలెక్టర్ సందీప్‌కుమర్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్-సిద్దిపేట, గంభీరావుపేటప కామారెడ్డి, రుద్రంగి, కోరుట్ల బోయిన్‌పల్లి, కరీంనగర్ మార్గాల్లో చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్ల మరమ్మతుకు అవసరమైన మెటీరియల్‌ను సిద్ధం గా ఉంచుకోవాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల ఈఈలను ఆదేశించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, జిల్లా వ్యవసాయాధి కారి అఫ్జల్‌బేగం, పౌరసరఫరాల శాఖ డీఎం రజిత, జిల్లా నీటి పారు దల శాఖ అధికారి కిషోర్, సీపీవో శ్రీనివాసచారి, అర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణయ్య, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, జిల్లా వైధ్యాధి కారి డాక్టర్ రజిత, డీసీహెచ్ డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:31 AM