నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - May 27 , 2025 | 12:20 AM
నేరాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్‌ను సీపీ సోమవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో మాట్లాడి శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
జమ్మికుంట, మే 26 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్‌ను సీపీ సోమవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో మాట్లాడి శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్, గాంధీ చౌరస్తా తదితర ముఖ్యమైన రద్దీ ప్రాంతాలను సందర్శించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ రద్దీ ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ రామకృష్ణ పాల్గొన్నారు.
ఫ వీణవంక: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సీపీ గౌస్ అలం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరీశీలించారు. కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్, ఎస్‌ఐ తోట తిరుపతి, ప్రొబేషనరీ ఎస్‌ఐ సాయికృష్ణ, ఏఎస్‌ఐ రవి పాల్గొన్నారు.
Updated Date - May 27 , 2025 | 12:20 AM