ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంద కృష్ణ సన్మాన సభను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:40 AM

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సుధాకర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సుధాకర్‌

- వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సుధాకర్‌

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సుధాకర్‌ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్‌, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వాతంత్య్ర వచ్చిన నాటి నుంచి దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వికలాంగుల సమాజాన్ని విస్మరించాయన్నారు. ఉద్యమ నేత మంద కృష్ణమాదిగ అట్టడుగున ఉన్న వికలాంగుల సమాజాన్ని చేరదీశారన్నారు. కేంద్ర ప్రభుత్వం మంద కృష్ణ సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించిందన్నారు. వికలాంగుల పక్షాన ఈ నెల 19న హైదరాబాద్‌లో మంద కృష్ణ ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వికలాంగులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు జోగని తిరుపతి, ఉపాధ్యక్షుడు తలారి సురేష్‌, నాయకులు మెరుగు రాములు పీర్లవంచ నరసయ్య, పెరుమాండ్ల సాయికుమార్‌, తాటి బెల్లి దుర్గయ్య, శోభ పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:40 AM