ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళాశక్తి చీరలు, యూనిఫాంలు సకాలంలో అందించాలి

ABN, Publish Date - May 18 , 2025 | 12:31 AM

రాష్ట్ర ప్రభుత్వం తయా రుచేయిస్తున్న ఇందిరా మహిళాశక్తి చీరలతోపాటు స్కూల్‌ యూని ఫాంల ఆర్డర్‌లు తీసుకున్న వారందరు సకాలంలో తయారు చేసి అందించాలని చేనేత జౌళిశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, టెస్కో జనరల్‌ మేనేజర్‌ అశోక్‌రావులు కోరారు.

సిరిసిల్ల రూరల్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తయా రుచేయిస్తున్న ఇందిరా మహిళాశక్తి చీరలతోపాటు స్కూల్‌ యూని ఫాంల ఆర్డర్‌లు తీసుకున్న వారందరు సకాలంలో తయారు చేసి అందించాలని చేనేత జౌళిశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, టెస్కో జనరల్‌ మేనేజర్‌ అశోక్‌రావులు కోరారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని చేనేత జౌళిశాఖ కార్యాలయంలో శనివారం ఇందిరా మహిళాశక్తి చీరలతయారీపై యాజమానులు, ఆసాములు, మ్యాక్స్‌ సొసైటీల అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చీరలు, స్కూల్‌ యూనిఫాంల తయారీలోని లోపాలను అడిగితెలుసుకు న్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో స్కూల్‌ యూనిఫాంల కోసం కోటి మీటర్ల తయారీకి ఇచ్చామని దానిని మే 31లో పూర్తి చేయాలని కోరారు. అలాగే సిరిసిల్లలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద చీరల తయారీ కోసం 131 మ్యాక్స్‌ సంఘాలకు 4.42కోట్లు మీటర్లు తయారుచేయడానికి ఆర్డర్‌ల ను ఇచ్చామన్నారు. చీరల తయారీలో ఆలస్యం చేయకుండా వేగంగా తయారుచేసి ఆగస్టు 31లో అందించే చర్యలు చేపట్టా లని కోరారు. ఎలాంటి సమస్యలున్న మాదృష్టికి తీసుకరావాలని కోరారు. ఈ సమావేశంలో వస్త్ర పరిశ్రమల యాజమానులు మంచే శ్రీనివాస్‌, అడెపు భాస్కర్‌, శంకర్‌, సుభాష్‌, మండల సత్యం, వేముల దామేదార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరమగ్గాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్లలో మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించడం తో పాటు కూలి పెంచి రావాల్సి సబ్సీడీలను అందించాలని సీఐటీ యూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం ర మణ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత జౌళిశాఖ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశానికి హాజరైన చేనేత జౌళీశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌ వెంకటేశ్వర్‌రావు, టెస్కో జీఎం అశోక్‌రావులను సీఐటీయూ నాయకులు కలిసి వినతిపత్రాన్ని అంద జేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌, వార్పిన్‌ యూని యన్‌ అధ్యక్షుడు సిరిమల్లె సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:31 AM