ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం

ABN, Publish Date - Jun 02 , 2025 | 12:43 AM

అభిషేక అర్చనలు, అలంకారాలు, హోమాలు, భక్తి పారవశ్యం నడుమ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఆదివారం పంచాదశ (15వ) వార్షికోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది.

పూర్ణాహుతి నిర్వహిస్తున్న విద్యారణ్య భారతి స్వామి, పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌

- హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అనుగ్రహ భాషణం

- పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌ కల్చరల్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): అభిషేక అర్చనలు, అలంకారాలు, హోమాలు, భక్తి పారవశ్యం నడుమ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఆదివారం పంచాదశ (15వ) వార్షికోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. వార్షికోత్సవ ప్రత్యక్ష పర్యవేక్షణ, నిర్వహణకు జగద్గురు శంకరాచార్య హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి ఆధ్వర్యంలో ఉదయం 4-30 గంటల నుంచి అమ్మవార్లకు అభిషేకం, గణపతి పూజ, లక్ష్మీగణపతి హోమం, రుద్ర సహిత ఛండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఉత్సవానికి ఆలయ నిర్వాహకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో హాజరై పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ వై సునీల్‌రావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఫ సనాతనధర్మమే శాశ్వతం

- హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి

సనాతన ధర్మమే శాశ్వతమైందని, అది ఒక సమగ్ర జీవన విధానమని, ఇందులో సత్యం, ధర్మం, సేవ, త్యాగం వంటి సద్గుణాలు ఇమిడి ఉన్నాయని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నా రు. వార్షికోత్సవం సందర్భంగా అనుగ్రహ భాషణం చేస్తూ సత్యాన్ని ప్రతిబింబింపజేసే ధర్మాన్ని పాటి స్తూ ప్రేమ, త్యాగంతో సమాజ సేవ చేయాలని అన్నారు. నేటి తరం తల్లిదండ్రులను, గురువులను గౌర వించాలని, ఆలయాలను సందర్శించాలని సన్మార్గంలో నడవాలని ధర్మాన్ని రక్షించాలని అన్నారు. భక్తు లకు ఫలాలు అందించి ఆశీర్వదించారు.

Updated Date - Jun 02 , 2025 | 12:43 AM