‘మహాలక్ష్మి’ మహిళలకు ఎంతో ఉపయోగం
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:25 AM
మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగకరంగా ఉందని, రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మహా లక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
సిరిసిల్ల, జూలై 23(ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగకరంగా ఉందని, రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మహా లక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణ లో రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల టికెట్లపై ఉచిత బస్ ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న పలువురు మహిళలను కలెక్టర్, డీఎం లు, అధికారులు సన్మానించారు.మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై విద్యార్థులకు వ్యాస రచన ఇతర పోటీలు నిర్వహించి విజేతలకు బహు మతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో బస్సులు నిర్వహించే సంస్థలు లేవని గుర్తుచేశారు. తెలం గాణ, కర్ణాటకలో మాత్రమే మహిళలకు ఉచిత బస్ ప్ర యాణాన్ని అందిస్తున్నారని వెల్లడించారు.జిల్లాలోని మహి ళలు దాదాపు 20 నెలల్లో మూడు కోట్ల ఉచిత టికెట్లపై ప్రయాణం చేశారని వెల్లడించారు. దీంతో వారికి రూ 110 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆదా అవుతున్న డబ్బులను పిల్లల ఆరోగ్యం, ఉన్నత చదువులు, పొదుపు ఇతర మా ర్గాల్లో పెట్టాలని సూచించారు. మహాలక్ష్మి పథకాన్ని విజ యవంతంగా కొనసాగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఆర్టీసీ డీఎంలు, సిబ్బందికి అభినందనలు తెలి యజేశారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న స్థలాన్ని మున్సి పల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు మహిళలు రాష్ట్రంలో 200 కోట్ల ఉచిత టికెట్లతో ప్రయాణం చేశారని, వాటి విలువ రూ 6680 కోట్లు ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ ప్రకాశరావు, డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 02:25 AM