ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘భూ భారతి’తో భూసమస్యలు పరిష్కారం

ABN, Publish Date - Apr 30 , 2025 | 11:59 PM

భూభారతి నూతన చట్టం ద్వారా పేద ప్రజల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు.

వీర్నపల్లి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : భూభారతి నూతన చట్టం ద్వారా పేద ప్రజల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రం లోని రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలోని అంశాలను, ప్రయోజనాలను ప్రజెంటేషన్‌ చేస్తూ వివ రించారు. కొత్త భూమి హక్కుల రికార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. భూ సమ స్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పిల్‌ వ్యవస్థ ఏర్పాటయింద న్నారు. భూమి రిజిస్ట్రేషన్‌ అనంతరం భూధార్‌ కార్డులను ప్రభు త్వం జారీ చేస్తుందన్నారు. వ్యవసాయేతర, ఆబాది, ఇంటి స్థలాల భూములకు హక్కుల రికార్డు నమోదు చేయబడుతుందన్నారు. రైతులకు భూభారతి చట్టంపై ఏవైనా సందేశాలుంటే అధికారుల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాములు నాయక్‌, వైస్‌ చైర్మన్‌ లెంకెల లక్ష్మణ్‌, ఇన్‌చార్జి ఎమ్మార్వో ముక్తార్‌పాషా, ఇన్‌చార్జి ఎం పీడీవో అబ్దుల్‌వాజీద్‌, ఏఈఓ దీపిక, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శివ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బిటి యాదవ్‌, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:59 PM