‘భూభారతి’తో భూసమస్యలు పరిష్కారం
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:28 PM
రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన భూభారతితో రైతుల భూసమస్యలు పరిష్కారం అవుతాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన భూభారతితో రైతుల భూసమస్యలు పరిష్కారం అవుతాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో శనివారం భూభారతి చట్టంపై అవగాహన సమావే శం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతు ధరణి వల్ల రైతు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకవచ్చిందన్నారు. భూసమస్యలతో బాధపడేవారంతా చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఉచి త న్యాయసహాయం అందించడంతో పాటు వచ్చేనెలలో గ్రామగ్రామాన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మా ట్లాడుతు హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉంద ని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందే భూముల సర్వే ఉంటుందన్నారు. పెండింగ్ సాదాబైనామాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మ్యాప్ జియోట్యాగింగ్‌తో పాస్‌బుక్కులు జారీచేయడం జరుగుతుందన్నారు. ఈసందర్భంగా రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో శశికళలతో పాటు వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 11:28 PM