‘స్వచ్చత’లో వెనుకంజ
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:13 AM
: కరీంనగర్ నగర పాలక సంస్థ స్వచ్ఛతలో వెనుకంజ వేస్తోంది. 2020-21లో, 2021,-22లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏది రెండో స్థానంలో నిలిచిన నగరపాలక సంస్థ ఈసారి ఏకంగా 14వ ర్యాంకుకు పడిపోయింది. జాతీయ స్థాయిలో గతేడాది 81వ ర్యాంకులో ఉన్న కరీంనగర్ ఈ సారి 166వ స్థానానికి పడిపోయింది.
కరీంనగర్ టౌన్ 21 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ నగర పాలక సంస్థ స్వచ్ఛతలో వెనుకంజ వేస్తోంది. 2020-21లో, 2021,-22లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏది రెండో స్థానంలో నిలిచిన నగరపాలక సంస్థ ఈసారి ఏకంగా 14వ ర్యాంకుకు పడిపోయింది. జాతీయ స్థాయిలో గతేడాది 81వ ర్యాంకులో ఉన్న కరీంనగర్ ఈ సారి 166వ స్థానానికి పడిపోయింది. కరీంనగర్ నగర పాలక సంస్థ పారిశుద్ద్య పనుల నిర్వహణలో వెనకబడింది. క్షేత్ర స్థాయిలో మార్పులు లేక పోవడంతో దాని ప్రబావం జాతీయ స్థాయి ర్యాంకుఐ పడింది. గతేడాది కంటే ఈ సారి రెట్టింపు స్థాయికి దిగజారింది. ఇటీవల ఢిల్లీలో 2024-25 సంవత్సరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు, అవార్డులు ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన దేశ, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు ఇచ్చారు.
ఫ వాటర్ ప్లస్‌లో స్థానం పదిలం...
మురుగు నీటిని శుద్ధి చేయడంతోపాటు చెరువులు, డ్యాం పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో వాటర్ ప్లస్‌లో కరీంనగర్ నగరపాలక సంస్థ తన స్థానాన్ని నిలుపుకుంది. జీఎఫ్‌సీ, వాటర్ ప్లస్ సర్టిఫికేషన్‌లో 2,500 మార్కులు ఉండగా వాటర్ ప్లస్‌లో 1,200 మార్కులు సాధించింది. రాష్ట్రంలో మూడింటికి ఈ మార్కులు దక్కగా అందులో కరీంనగర్ ఒకటి. గతేడాది లక్ష నుంచి మూడు లక్షల జనాభాను పరిగణలోకి తీసుకోవడంతో ర్యాంకుల్లో మెరుగైన స్థానం లభించింది.
ఫ ఎక్కడ పడితే అక్కడ చెత్త...
నగరంలో రహదారుల వెంట ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు, సకాలంలో తొలగించకపోవడంతో అధ్వానంగా మారింది. దీంతో జీఎఫ్‌సీ (గార్బెజ్ ఫ్రీ సిటీ)లో స్టార్ రేటింగ్‌లో మార్కులు రావడం లేదు. వర్మీ కంపోస్టు నామమాత్రంగా ఉండడం, పొడి చెత్త నిర్వహణ లేక పోవడం వంటివి కారణాలు ఉన్నాయి. ఇంటింటా చెత్త సేకరణలో నిర్లక్ష్యం కనిపించింది. స్వచ్ఛ ఆటోలు సరిగా రాకపోవడం, ఇంటి యజమానులతో కార్మికులు అనుసరిస్తున్న తీరుతో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాల తనిఖీల సమయంలో నగరవాసులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇందులో 40 శాతం మాత్రమే మార్కులు వచ్చాయి.
Updated Date - Jul 22 , 2025 | 12:13 AM