ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:12 AM
ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు ఇంకా రాలేదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు ఇంకా రాలేదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని 2024 డిసెంబర్ 23న రాజకీయంగా బొందపెట్టారన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శివనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయలో విలేకరుల సమావేశంలో కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడా రు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోయి మతి భ్రమించి అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావుల నాలుగుస్థంబాలాట నడుస్తుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు ఇంకారాలేదని, ఆయన ఇప్పటికి తండ్రి చాటు బిడ్డనే అని ప్రజలకు తెలుసన్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయాకా వారు చేసిని అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఊపిరాడ క ఉత్తర ప్రగాల్భాలు పలుకుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టే ప్రజలు ఆ పార్టీని బొందపెట్టారన్నారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, దళితులందరికి మూడు ఎకరాల భూమి అన్నాడు, తెలంగాణలో ఇంటి కో ఉద్యోగమన్నాడు, ఎస్టీలకు 12శాతం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానన్నాడు, నిరుద్యోగభృతి ఇస్తాన న్నాడు, దళిత బంధు ఎంత మందికి ఇచ్చాడో కేటీఆర్ వెల్లి కేసీఆర్‌ను అడగాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి కేసీఆర్ రావాలని బంకచర్ల, కాళ్లేశ్వరం ప్రాజెక్టు, ఈ కారు రేసింగ్ అవినీతిపై మాటా ్లడుదాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా అంటే కేటీఆర్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరో పించారు. కాళ్లేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ లతో కేటీఆర్ భాగోతం, లీలలు, కుంభకోణాలు నీవాల్ల తోనే ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయని అన్నారు. రాజకీయంగా నీ స్థాయి ఏంటో తెలంగాణ ప్రజలు చూపించారని నీ స్థాయిని మరిచి మాట్లాడవద్ద న్నారు. రిపోర్టర్ గడదాస్ ప్రసాద్ గుండె పోటుతో మృతిచెందడం బాధకరమని వారి కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతిని తెలి యజేశారు. అనంతరం స్థానిక మూడవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండ వాలు వేసి కేకే మహేందర్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, డైరెక్టర్లు ఎండీ ఖాజా, కాసర్ల రాజు, కాంగ్రెస్ ఎస్సీ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మాజీ కౌన్సిలర్లు యెల్లె లక్ష్మినారాయణ, వేముల రవి, కుడికాల రవికుమార్, వెంగళ లక్ష్మి నర్సయ్య, మడుపు శ్రీదేవి, ఆడెపు చంద్రకళ, రాగుల రాములు, కత్తెర దేవదాస్, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరెళ్ళ శ్రీకాంత్‌గౌడ్, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, నాయకులు వైద్య శివప్రసాద్, వెల్ముల తిరుపతిరెడ్డి, కాముని మల్లిఖార్జున్, సిహెచ్ కమలాకర్ రావు పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 02:12 AM