Karimnagar: అశాస్త్రీయంగా డివిజన్ల పునర్విభజన
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:28 AM
సుభాష్‌నగర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మున్సిపల్ అధికారులు చేసిన డివిజన్ల పునర్విభజన ఆశాస్త్రీయంగా ఉందని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆరోపించారు.
సుభాష్‌నగర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మున్సిపల్ అధికారులు చేసిన డివిజన్ల పునర్విభజన ఆశాస్త్రీయంగా ఉందని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆరోపించారు. బుధవారం నగరం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 డివిజన్లను 66 డివిజన్లుగా శాస్త్రీయత లేకుండా ముసాయిదా తయారుచేశారని ఆరోపించారు. ఇందుకోసం మున్సి పల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఐఏఎస్‌లను తప్పుదోవ పట్టించారని అన్నారు. అధికా రులు తయారు చేసిన తప్పుడు ముసాయిదా జాబి తాపై ఐఏఎస్ అధికారులు గుడ్డిగా ఎలా సంతకం చేశారో అర్థం కావడంలేదన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా బౌండరీలు సరిగా ఏర్పాటు చేయలేదన్నారు. దీనిపై కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాల న్నారు. వంద ఫీట్ల రోడ్డు, 60 ఫీట్ల రోడ్డు హద్దులుగా డివిజన్లను విభజిం చాలని, కానీ ఆ నియమాన్ని ఎక్కడా ఫాలో అయినట్లుగా కనిపించడం లేదన్నారు. కలెక్టర్ ను కలిసి తప్పుడు ముసా యిదా తయారు చేసిన అధికారులపై చర్యలు తీసుకో వాలని కోరుతామని, స్పందన లేకపోతే కోర్టును ఆశ్రయిస్తా మని తెలిపారు. 66డివిజన్ల ఓటరు లిస్టుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిస్టుకు ఎక్కడా పొంతన లేకుండా పోయిందన్నారు. సమావేశంలో మాజీ కార్పొరే టర్లు కంసాల శ్రీనివాస్, సుధగోని మాధవి, ఏదుల రాజశేఖర్, నాంపల్లి శ్రీనివాస్, నక్క పద్మ, కృష్ణ, సదానందచారి, బీఆర్‌ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, బేతి చంద్రశేఖర్, ఆరె రవి, కొత్త అనిల్, జెల్లోజి శ్రీనివాస్, కర్రె అనిల్, దుడ్డెల ప్రశాంత్, ఈసరి జశ్వంత్, గూడెల్ల రాజకు మార్ తదితరులు ఉన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:28 AM