ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలి

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:04 AM

తిమ్మాపూర్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): గ్రామస్థుల సహకారంతో పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య మరింత పెంచాలని జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీరాం మొండయ్య సూచించారు.

- జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య

తిమ్మాపూర్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): గ్రామస్థుల సహకారంతో పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య మరింత పెంచాలని జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీరాం మొండయ్య సూచించారు. మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం మొండయ్య ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన విలువలు కలిగి ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.మహేశ్వర్‌, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాద్యాయులు పి.శ్రీనివాస్‌, జిసిడిఓ కృపారాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల భవిత కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భవిత కేంద్రం పనితీరు, కార్యక్రమాలు, పిల్లల గురించి మండల విద్యాధికారి శ్రీనివాస్‌ను, ఐఆర్పీలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:04 AM