ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:06 AM

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): నగర పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా తగిన చర్యలు చేపడుతామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అన్నారు.

- నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): నగర పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా తగిన చర్యలు చేపడుతామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌గా ప్రపుల్‌ దేశాయ్‌ బదిలీపై వెళ్లిన చాహత్‌ బాజ్‌పాయ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు, ఇతర పథకాలు నగర ప్రజలకు అందేలా చర్యలు చేపడుతామని తెలిపారు. అలాగే నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు అభివృద్ధి పనులతోపాటు ఇతర గ్రాంట్స్‌ అభివృద్ధి పనుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం నగర పాలక సంస్థ డీలిమిటేషన్‌ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మేజర్‌ సమస్యలు ఉన్నట చోట్లను స్వయంగా పరిశీలించి డీలిమిటేషన్‌ చేస్తామన్నారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలు అందిస్తామని తెలిపారు. ప్రధానంగా పారిశుధ్యంలో సమూల మార్పులు తెచ్చి పరిశుభ్రమైన నగరాన్ని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచి గ్రీన్‌ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 12:06 AM