ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: ఘనంగా రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:30 AM

కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):దేశ సమైక్యత, సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం తపిం చే వ్యక్తి రాహుల్‌ గాంధీ అని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):దేశ సమైక్యత, సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం తపిం చే వ్యక్తి రాహుల్‌ గాంధీ అని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతి పక్ష నేత, జాతీయ కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మె ల్యే, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహ్మత్‌ హుస్సేన్‌లతో పాటు పలువురు నేత లు హాజరయ్యారు. అనంతరం నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్‌ హుస్సేన్‌, నాయకులు ఎండీ తాజ్‌, కర్ర సత్యప్రసన్నరెడ్డి, మడుపు మోహన్‌, శ్రావణ్‌ నాయక్‌, గడ్డం విలాస్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, చర్ల పద్మ, బొబ్బిలి విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌: అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ వొడితెల ప్రణవ్‌ కేక్‌ కట్‌ చేశారు.

జమ్మికుంట: పట్టణంలోని గాంధీచౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఇల్లందకుంట దేవస్థానం మాజీ చైర్మన్‌ దేశీని కోటి హాజరై కేకు కట్‌ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు.

గంగాధర: గంగాధరలో జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు మనోహర్‌, జాగిరపు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు వేముల భాస్కర్‌ తదితరులు ఘనంగా నిర్వహించారు.

మానకొండూర్‌: మానకొండూర్‌లో పల్లెమీద బస్టాండ్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎన్‌ రవీంద్రాచారి, డీసీసీ ప్రధానకార్యదర్శి సంపత్‌గౌడ్‌, ఎం ఓదెలు ఉన్నారు.

రామడుగు: మండలకేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాజిహరీష్‌ ఆధ్వర్యంలో రాహు ల్‌ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. అనంతరం రైతుభరోసా విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

వీణవంక: మండలకేంద్రంతోపాటు చల్లూరులో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్స్‌ పంపి ణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌ రెడ్డి, గంగాడి తిరుపతి రెడ్డి, తదితరులున్నారు.

గన్నేరువరం: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మం డల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి వేడు కలను ఘనంగా నిర్వహించారు.

చొప్పదండి: చొప్పదండిలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కేక్‌ కట్‌ చేసి స్వీట్లను పంపిణీ చేశారు.

Updated Date - Jun 20 , 2025 | 12:30 AM