Karimnagar: వైద్య సిబ్బంది మెరుగైన సేవలందించాలి: కలెక్టర్ పమేలా సత్పతి
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:25 AM
హుజూరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఆమె సందర్శించారు.
హుజూరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్, ఐసీయూ, ఓపీ విభాగం, వార్డులను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గర్భిణులకు వైద్య సహాయం అవసరం అనుకుంటే ప్రసవానికి ముందే ఆస్పత్రిలో చేర్చుకోవాలన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ క్యాంపును వెంటనే ప్రారంభించాలన్నారు. 108 సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీసీహెచ్ చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి, ఆర్‌ఎంవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీకాంత్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, ఆర్డీవో రమేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పాల్గొన్నారు.
ఫ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
హుజూరాబాద్ రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కనుకులగిద్దె గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 20 వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. భూ సమస్యలున్న వారు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆర్డీవో రమేష్‌బాబు, తహసీల్దార్ కనకయ్య పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:25 AM