Karimnagar: విద్య, వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:03 AM
మానకొండూర్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
- ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూర్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని ఊటూర్, రంగపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీరోడ్లు, మురికి కాల్వలు, పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు ఆయన భూమి పూజ, ప్రారంభోత్సవాలను చేశారు. అనంతరంమాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. పీహెచ్‌సీలలో సాధారణ ప్రసవాలను చేయాలన్నారు. గ్రామాల్లో లక్షలాది రూపాయలతో సీసీరోడ్లు, మురికి కాల్వలను నిర్మించినట్లు తెలిపారు. లక్ష్మీపూర్ గ్రామంలో గ్రంథాలయం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు రాపాక ప్రవీణ్ వినతిపత్రం అందించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో వరలక్ష్మీ, నందగిరి రవీంద్రాచారి, ఏఎంసీ చైర్మన్ మర్రి ఓదెలు, వైస్‌చైర్మన్ రామిడి తిరుమల్‌రెడ్డి, తాళ్లపల్లి సంపత్‌గౌడ్, రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, గోపు శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:03 AM