Karimnagar: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:11 AM
భగత్‌నగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
సీపీఐ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
- సీపీఐ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపు
భగత్‌నగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడానికి సీపీఐ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల మధ్య ఉండి పనిచేయాలన్నారు. సీపీఐ నుంచి ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికలు జరుగకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయిందని, కేంద్రం నుంచి వచ్చే నిధులు రావడంలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటినుండే కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు పోనగంటి కేదారి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందె స్వామి, గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి,పిట్టల సమ్మయ్య, కిన్నెర మల్లవ్వతో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు
Updated Date - Jul 05 , 2025 | 12:11 AM