Karimnagar: బైపాస్ రోడ్డుపై రైతుల ఆందోళన
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:19 AM
శంకరపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామరైతులు బైపాస్ రోడ్డుపై గురువారం రాళ్లు అడ్డుపెట్టి, నిలబడి రహదారి నిర్మాణసంస్థ వాహనాలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు.
జాతీయ రహదారిపై బైపాస్‌పై ఆందోళన చేస్తున్న అంబాలాపూర్ రైతులు
శంకరపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామరైతులు బైపాస్ రోడ్డుపై గురువారం రాళ్లు అడ్డుపెట్టి, నిలబడి రహదారి నిర్మాణసంస్థ వాహనాలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతున్న ఏడాదిన్నరగా పొలాల్లో పైనుంచి వచ్చే వర్షం నీరునిలిచి నష్టం వాటిల్లుతోందన్నారు. బైపాస్ రోడ్డులో కల్వర్టు నిర్మించినప్పటికీ సైడ్ వాల్స్ నిర్మించకపోవడంతో మట్టితో నిండిపోయి నీరు బయటకు పోతోందన్నారు. తద్వారా పంట పొలాల్లోనే నీరు ఉండడంతో సుమారు నాలుగెకరాల వరకు నష్టం జరుగుతోందని రైతులు వాపోయారు. ఈ విషయాన్ని సంవత్సరకాలంగా జాతీయ రహదారి నిర్మాణసంస్థ ఉద్యోగులకు చెప్పితే చేస్తామని దాటి వేస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. రైతులు అడ్డుకున్న సమాచారం తెలుసుకున్న జాతీయరహదారి నిర్మాణ సంస్థ ఉద్యోగి శర్మ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి నష్టం జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు కాంతాల మల్లారెడ్డి, కాంతాల రాజిరెడ్డి, పాశం నర్సింహారెడ్డి, సముద్రాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 11 , 2025 | 12:19 AM