ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:08 AM

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతర కృషిలో భాగంగా కరీంనగర్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, క్విక్‌ రియాక్షన్‌ టీం (క్యూఆర్‌టీ) పోలీసు సిబ్బందికి మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై సమగ్ర శిక్షణ నిర్వహించినట్లు పోలీస్‌ కమీషనర్‌ గౌస్‌ ఆలం తెలిపారు.

- మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై పోలీసులకు శిక్షణ

- పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతర కృషిలో భాగంగా కరీంనగర్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, క్విక్‌ రియాక్షన్‌ టీం (క్యూఆర్‌టీ) పోలీసు సిబ్బందికి మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై సమగ్ర శిక్షణ నిర్వహించినట్లు పోలీస్‌ కమీషనర్‌ గౌస్‌ ఆలం తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అల్లరి మూకలను సమర్థవంతంగా చెదరగొట్టడానికి పోలీసులు నిర్వర్తించాల్సిన విధులను అభ్యాసం చేయడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్ధేశ్యమని పేర్కొన్నారు. కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డులోని కమిషనరేట్‌ శిక్షణ కేంద్రం(సీటీసీ)లో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. లాఠీ డ్రిల్‌, గ్యాస్‌ గన్‌ పేల్చే విధానం, ఫైరింగ్‌ తదితర అంశాలపై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమీషనర్‌ గౌస్‌ ఆలం మాట్లాడుతూ అల్లరి మూకలను చెదరగొడుతూ స్వీయ రక్షణను పాటిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. లాఠీచార్జ్‌పై సాధన చేసినట్లు తెలిపారు. స్మోక్‌ గన్‌ ఫైరింగ్‌, వజ్ర వాహనాన్ని వినియోగించడంపై శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రజనీకాంత్‌, జానీమియా, కుమారస్వామి, శ్రీధర్‌రెడ్డితో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:08 AM