Karimnagar: చేపల మార్కెట్లలో సందడి
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:22 AM
కరీంనగర్ కల్చరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తి తొలిరోజు ఆదివారం చేపల మార్కెట్‌లో సందడి నెలకొంది. ఇటు చేప మందు, అటు ఈ కార్తిలో చేపలు తప్పకుండా తినాలనే ఆనవాయితీ, పైగా ఆదివారం కావడంతో మార్కెట్లు జనాలతో కళకళలాడాయి.
అమ్మకానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల చేపలు
- మృగశిర తొలి రోజు జోరుగా అమ్మకాలు
కరీంనగర్ కల్చరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తి తొలిరోజు ఆదివారం చేపల మార్కెట్‌లో సందడి నెలకొంది. ఇటు చేప మందు, అటు ఈ కార్తిలో చేపలు తప్పకుండా తినాలనే ఆనవాయితీ, పైగా ఆదివారం కావడంతో మార్కెట్లు జనాలతో కళకళలాడాయి. బైపాస్ రోడ్, నగర శివారు ప్రాంతాల్లో అమ్మకాలు జోరుగా సాగాయి. గ్రామీణ ప్రాంతాల మత్స్యకారులు చేపలు పట్టి గ్రామాల్లో, నగరంలో తిరుగుతూ అమ్మారు. ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లో రద్దీ నెలకొనగా మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. సెంటిమెంట్ కావడంతో ధరలు పెరిగినా వినియోగదారులు కొన్నారు. మామూలు రోజుల కంటే ధరలు రెట్టింపయ్యాయి. కొర్రమట్ట, రవులు, జెల్లలు పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి. వాటితోపాటు పలు రకాల చేపలు కిలోఓకు 300 నుంచి రూ. 800 రూపాయల వరకు పలికాయి. ఆదివారం మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల కిలోల చేపలు అమ్ముడు పోయాయి. సాయంకాలం వీటి అంచనా కొంచెం పెరిగింది. గ్రామాల్లో షికారీ చేపలు ఎక్కువగా అమ్ముడు పోయాయి. శనివారం అంగడి, ప్రధాన కూరగాయల మార్కెట్, రైతు బజార్, రాంనగర్ ఫిష్ మార్కెట్లలో రద్దీ నెలకొంది.
Updated Date - Jun 09 , 2025 | 12:22 AM