ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: బయో మైనింగ్‌ను నిరంతరం కొనసాగించాలి

ABN, Publish Date - Mar 28 , 2025 | 12:10 AM

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): బయోమైనింగ్‌ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ కాంట్రాక్టు ఏజెన్సీని ఆదేశించారు.

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): బయోమైనింగ్‌ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ కాంట్రాక్టు ఏజెన్సీని ఆదేశించారు. గురువారం నగరంలోని హౌసింగ్‌బోర్డు, కోతిరాంపూర్‌లలో ఆమె పర్యటించారు. నగరపాలక సంస్థ రీసోర్సు పార్కును సందర్శించి అభివృద్ధిలో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్‌, డీఆర్‌సీసీ సెంటర్‌, వర్మీకంపోస్టు పిట్స్‌ను తనిఖీ చేశారు. కోతిరాంపూర్‌లోని డంపింగ్‌యార్డును సందర్శించి బయోమైనింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్‌, నూతన కంపోస్టు పిట్స్‌ పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్‌సీసీలో సెగ్రిగేషన్‌ ప్రక్రియను కొనసాగించి తడి చెత్త వ్యర్థాలతో కంపోస్టు ఎరువులను తయారు చేయాలని ఆదేశించారు. బయోమైనింగ్‌పై ప్రతిరోజు రిపోర్టు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ స్వామి పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:10 AM