Karimnagar: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:27 AM
కరీంనగర్ క్రైం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): సైబర్ మోసాలపై యువత, విద్యార్థులు, ఉద్యోగులు, తదితర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సైబర్ క్రైం పోలీస్‌టీం అధికారులు అన్నారు.
సైబర్ క్రైం నేరాలపై అవగాహన కల్పిస్తున్న కానిస్టేబుల్
- మోసాలపై టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలి
- ఎన్‌సీసీ క్యాడెట్‌లు, ఉపాధ్యాయులు, ఆర్మీ అధికారులకు అవగాహన
కరీంనగర్ క్రైం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): సైబర్ మోసాలపై యువత, విద్యార్థులు, ఉద్యోగులు, తదితర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సైబర్ క్రైం పోలీస్‌టీం అధికారులు అన్నారు. రామడుగు మండలం వెదిర గ్రామంలోని ఎన్‌సీసీ క్యాంపులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలు, ఏపీకే ఫైళ్లను క్లిక్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు, కాల్ ఫార్వార్డింగ్ ద్వారా జరిగే ఫిషింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, మ్యూల్ అకౌంట్లు, రివ్యూ రేటింగ్ స్కామ్‌లు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఒకవేళ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఇలాంటి సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో లేదా 8712665866 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
Updated Date - Jun 09 , 2025 | 12:27 AM