ఎర్లీబర్డ్ స్కీంలో జమ్మికుంటకు ప్రథమస్థానం
ABN, Publish Date - May 02 , 2025 | 12:47 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీంలో జమ్మికుంట మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ తెలిపారు.
జమ్మికుంట, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీంలో జమ్మికుంట మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏప్రిల్ నెలలో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం ఐదు శాతం రిబేట్ ప్రకటించిందన్నారు. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 151 మున్సిపాలిటీల్లో జమ్మికుంట 1.89 కోట్లు (55.04శాతం) వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గతంలో ఆస్తి పన్ను వసూళ్లలో సైతం జమ్మికుంట రాష్ట్రంలో ప్రథమ స్థానం సాదించినట్లు గుర్తు చేశారు. తమ సిబ్బంది ఆస్తి పన్ను చెల్లిస్తే కలిగే లాభాలను పట్టణ ప్రజలకు వివరించారని, అందువల్లే రాష్ట్రంలోనే అందరి కన్నా ఆస్తి పన్ను ఎక్కువ వసూళ్లు చేయగలిగామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. మూడు కోట్లు కేటాయించిందన్నారు. సమావేశంలో మేనేజర్ రాజిరెడ్డి, ఆర్‌ఐ భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - May 02 , 2025 | 12:47 AM