దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ కృషి
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:36 AM
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ దళి తుల అభ్యున్నతికి కృషి చేశారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్‌రామ్ వర్ధంతి సంద ర్భంగా ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నివాళులు అర్పించారు.
కరీంనగర్ అర్బన్, జూలై 6(ఆంధ్రజ్యోతి): మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ దళి తుల అభ్యున్నతికి కృషి చేశారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్‌రామ్ వర్ధంతి సంద ర్భంగా ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సివిల్ హాస్పిటల్ చౌరస్తాలోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వెన్న రాజమల్లయ్య, కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు బానోతు శ్రావణ్ నాయక్, బొబ్బిలి విక్టర్, కల్వల రాంచందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దండి రవీందర్, రమేష్, అబ్దుల్ భారీ, నెల్లి నరేష్, మాదాసు శ్రీనివాస్, మంద మహేష్, బషీర్ ఉద్దీన్, అనిల్‌కుమార్, నీరజ పాల్గొన్నారు.
మానకొండూర్ : బారత మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రామ్ ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషిచేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ అన్నారు. జగ్జీవన్‌రామ్ వర్ధంతిని మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెపల్లి మోహన్ పాల్గొని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, మాజీ ఉపసర్పంచు బొల్లం వెంకట్‌స్వామి, రొడ్డ యాదగిరి, ఆర్‌ఐ రాములు, సయ్యద్ హమీద్‌అలీ, సయ్యద్ సిరాజోద్దీన్, రొడ్డ అంజయ్య, మడుపు ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:36 AM