ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

jagitiala : సమస్యలు ‘డబుల్‌’

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:19 AM

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూకపల్లి అర్బన్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు సౌక ర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు.

-నూకపల్లి అర్బన్‌ కాలనీలో మౌలిక వసతులు కరువు

-పూర్తి కాని నీటి ట్యాంకులు, అంతర్గత రోడ్లు

-ట్యాంకర్‌ నీటిపైనే ఆధారపడుతున్న డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులు

-అరకొర సౌకర్యాలతో జనం అవస్థలు

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూకపల్లి అర్బన్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు సౌక ర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ గత ప్రభుత్వ హయాంలో నూకపల్లి అర్బన్‌ కాలనీలో నాలుగున్నరవేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించారు. ఇందులో 3500 మంది లబ్ధిదారులకు అలాట్‌ చేశారు. కానీ కాలనీలో తాగునీటి ట్యాంకులు, అంతర్గత రహదారులు పూర్తి కాకపోవడంతో కేవలం 1000 కుటుంబాలు మాత్రమే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నివాసం ఉంటున్నాయి. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ 70 కోట్ల రూపాయలను విడుదల చేయించినా పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నివసించడానికి చాలా మంది లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.

ఫతాగు నీటి గోస

కాలనీలో 4500 కుటుంబాలకు సరిపడా తాగునీటి ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్‌ పనులు పూర్తి కాకపోవడంతో తాగునీటి కోసం జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 1000 కుటుంబాలు మాత్రమే కాలనీలో నివసిస్తుండగా వారికి కూడా అరకొర నీటి సరఫరా జరుగుతోంది. ఆయా కుటుంబాలు నీటి ట్యాంకర్‌ పైనే ఆధార పడాల్సిన దుస్థితి నెలకొంది. మరో 3500 కుటుంబాలు ఇళ్లలోకి వస్తే ఇంకా తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ఫపూర్తి కాని అంతర్గత రోడ్లు

నూకపల్లి డబుల్‌ కాలనీలో ఇప్పటి వరకు అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పలు చోట్ల రోడ్లు ఇటీవల కురుస్తున్న కొద్ది పాటి వర్షానికే బురదమయం అవుతున్నాయని వర్షాలు తీవ్రంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తి అయిన రోడ్లతో పాటు ప్రధాన రహదారి, అంతర్గత రోడ్లు పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఫఆగని చెత్త వాహనాలు

నూకపల్లి అర్బన్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నప్పటికీ జగిత్యాల మున్సిపల్‌ చెత్త వాహనాలు సేకరణకు వెళ్లడం లేదు. దీంతో చెత్త వేయడానికి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల పట్టణంలోని చెత్తను తమ ప్రాంతంలోనే ఉన్న చెత్త డంప్‌లో వేయడానికి నిత్యం అనేక వాహనాలు వస్తున్నప్పటికీ తమ ఇళ్ల నుంచి తీసుకెళ్లడానికి మున్సిపల్‌ సిబ్బంది ఆగడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సౌకర్యాలు కల్పించాలి

-వినోద్‌ కుమార్‌, నూకపల్లి అర్బన్‌ కాలనీ

మేము జగిత్యాల పట్టణంలో నుంచి నూకల్లి కాలనీకి వచ్చి నివసిస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం. కానీ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి. నీటి సమస్య తీర్చి మురికి కాలువలను శుభ్రం చేయించాలి. మురికి కాలువలలో పిచ్చి మొక్కలు పెరగడంతో దోమలు చేరి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలి.

తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

-రహమాన్‌, నూకపల్లి అర్బన్‌ కాలనీ

కాలనీలో తాగు నీటికి ఇక్కట్లు ఎదుర్కొంటున్నాం. పూర్తి స్థాయిలో లబ్ధిదారులు చేరితే నీటికి మరింత ఇబ్బందులు తప్పవు. మేము డ్రమ్ముల్లో నీళ్ళు నిల్వ చేసుకుంటున్నాం. ఇప్పటికే కొంత మంది నీరు లేక తిరిగి జగిత్యాలకు వెళ్లిపోయారు. కాలనీలో నీటి సౌకర్యంతో పాటు ఇతర వసతులు కల్పిస్తు ఎమ్మెల్యేకు రుణ పడి ఉంటాం.

Updated Date - Jun 13 , 2025 | 01:19 AM