ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

jagitiala : నిలిచిన ‘పీఎం స్వనిధి’

ABN, Publish Date - May 19 , 2025 | 12:46 AM

జగిత్యాల, మే 18 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో చిరు, వీధి వ్యాపారులకు అందించే పీఎం స్వనిధి (ఆత్మనిర్భర్‌ నిధి) రుణాల ప్రక్రియ నిలిచిపోయింది.

-వీధి వ్యాపారులకు అందని రుణాలు

-నాలుగున్నర నెలలుగా పనిచేయని సైట్‌

-ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులు

జగిత్యాల, మే 18 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో చిరు, వీధి వ్యాపారులకు అందించే పీఎం స్వనిధి (ఆత్మనిర్భర్‌ నిధి) రుణాల ప్రక్రియ నిలిచిపోయింది. నాలుగున్నర నెలలుగా సంబంధిత సైట్‌ పనిచేయడం లేదు. దీంతో స్వనిధి రుణాలు అందడం లేదు. దీంతో తొలి, మలి రుణాల కోసం ఎదురుచూస్తున్న వీధి వ్యాపారులు నిరాశకు గురవుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, దర్మపురి మున్సిపాలిటీల్లో చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించే వీధి వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. 2020 సంవత్సరంలో కరోనా లాక్‌ డౌన్‌ నుంచి ఆత్మ నిర్భర్‌ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు మొదటి విడతలో రూ.10 వేల రుణం అందజేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం అందజేసే ఈ మొత్తం వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడేది.

ఫరుణం కోసం ఎదురుచూపులు..

ఐదు సంవత్సరాల క్రితం ప్రతీ వీధి వ్యాపారికి రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేయగా ఈ మొత్తాన్ని ఏడాది లోపు వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన వారికి మళ్లీ రుణం తీసుకోవడానికి వీలు కలిగేది. రెండో విడతలో రూ.20 వేలు అందించగా, మూడో విడతలో దానిని రూ.50 వేలకు పెంచారు. రుణం మొత్తం పెరుగుతూ ఉండడం, వ్యాపారాభివృద్ధికి తోడుగా నిలవడంతో లబ్ధిదారులు రుణం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకర్లు సైతం ఈ రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి అందించేందుకు ముందుకొచ్చారు. కానీ నాలుగున్నర నెలలుగా రుణాలు అందించడం లేదు. దీంతో సంబంధిత వీధి వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఫరుణాన్ని రూ.లక్షకు పెంచితే...

ఆత్మనిర్భర్‌ నిధి పథకం కింద రుణాలు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించింది. అయితే ఇటీవల కొత్త పథకం అమలు చేసేందుకు వీలుగా సాంకేతిక పరంగా ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో పాత వారితో పాటు కొత్త వారికి కూడా రుణాలు అందించేందుకు తాత్కలికంగా బ్రేడ్‌ పడినట్లు తెలుస్తోంది. కొత్త పథకం అమలు చేసేంత వరకు పీఎం స్వనిధి పథకం నిలిచిపోయినట్లుగానే భావిస్తున్నారు. అయితే వీధి వ్యాపారులకు రూ.50వేల వరకు ఇస్తున్న రుణాన్ని రూ.లక్షకు పెంచాలని పలువురు కోరుతున్నారు. దీంతో ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు ఉపాధి పెరిగి జీవన ప్రమాణాలు మరింత పెరుగుతాయని వారు అంటున్నారు.

ఫజిల్లాలో 16,981 మంది వీధి వ్యాపారులు

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 16,981 మంది వీధి వ్యాపారులున్నారు. ఇందులో రాయికల్‌లో 929 మంది, ధర్మపురిలో 1,020 మంది, జగిత్యాలలో 6,929 మంది, మెట్‌పల్లిలో 3,770 మంది, కోరుట్లలో 4,334 మంది వీధి వ్యాపారులున్నట్లు మెప్మా కార్యాలయాల రికార్డులు వెల్లడిస్తున్నాయి.

సాంకేతిక సమస్యలతో జాప్యం

-దుర్గపు శ్రీనివాస్‌ గౌడ్‌, మెప్మా జిల్లా పరిపాలన అధికారి

పీఎం స్వనిధి ప్రక్రియకు సంబంధించిన వెబ్‌సైట్‌ కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. దీంతో వీధి వ్యాపారులకు రుణాల మంజూరు సాధ్యం కావడం లేదు. సైట్‌ పునరుద్ధరణ జరగాల్సి ఉంది. సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం ఏర్పడింది. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లాం. సాంకేతిక సమస్యలు సరిచేయగానే పునరుద్ధరణ జరుగుతుంది.

-------------------------------------------------------------------------------------------------------

పీఎం స్వనిధి రుణాల మంజూరు వివరాలు...

-------------------------------------------------------------------------------------------------------

మున్సిపాలిటీ....వీధి వ్యాపారులు...రూ.10 వేలు.............రూ.20 వేలు..............రూ.50 వేలు

-------------------------------------------------------------------------------------------------------

ధర్మపురి.....................982..........................734.........................455.................................146

మెట్‌పల్లి...................3,713........................2,791......................1,124.................................401

రాయికల్‌...................934.........................799.........................395......................................165

కోరుట్ల......................4,188........................3,321.....................1,683.................................476

జగిత్యాల...................6,825......................4,782......................2,351.................................682

-------------------------------------------------------------------------------------------------------

మొత్తం................... 16,632....................12,427....................6,008.................................1,870

-------------------------------------------------------------------------------------------------------

Updated Date - May 19 , 2025 | 12:46 AM