ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

jagitiala : మున్సిపాలిటీల్లో ‘మాన్‌సూన్‌’

ABN, Publish Date - Jun 02 , 2025 | 01:04 AM

జగిత్యాల, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం మాన్‌సూన్‌ పేరిట వంద రోజుల ప్రణాళికను రూపొందించింది.

-వానాకాలం సమస్యలను అధిగమించేందుకు 100 రోజుల ప్రణాళిక

-నేటి నుంచి సెప్టెంబరు 10 వరకు యాక్షన్‌ప్లాన్‌ అమలు

-ప్రజారోగ్యం, పారిశుధ్యంపై మున్సిపల్‌ శాఖ ప్రత్యేక దృష్టి

జగిత్యాల, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం మాన్‌సూన్‌ పేరిట వంద రోజుల ప్రణాళికను రూపొందించింది. ఈనెల 2వ తేదీ నుంచి సెప్టెంబరు 10వ తేదీ వరకు అన్ని మున్సిపాలిటీల్లో మురుగు కాలువలు, నాలాలు, ఓపెన్‌, భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయడంతో పాటు పాడైపోయిన మ్యాన్‌హోళ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టనున్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఆయా కార్యక్రమాలు చేపడుతూ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళికను అమలు చేయడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

ఫప్రజలకు ముందస్తు అవగాహన

వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. బస్తీలు, కాలనీలు, రహదారులు, ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాల్లో ప్రతీరోజు బ్లీచింగ్‌ చేయడం, ఫాగింగ్‌ చేయడం, చెరువుల్లో దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ద్రావణాన్ని స్ర్పే చేయనున్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు ముందుస్తుగా అవగాహన కల్పించనున్నారు.

ఫఉమెన్‌ అమృత్‌మిత్ర 2.0...

మున్సిపాలిటీలలో వన మహోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ఉమెన్‌ అమృత్‌మిత్ర 2.0 కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించి ఉమెన్‌ ఫర్‌ ట్రీ పేరిట మహిళలతో మొక్కలు నాటించి సంరక్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పాటు మున్సిపాలిటీల్లోని అన్ని పార్కులు, ఇళ్ల వద్ద, చెరువు కట్టలు, వాకింగ్‌ ట్రాక్‌లు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ భవనాల వద్ద ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు.

ఫఅన్ని వర్గాల భాగస్వామ్యం..

మాన్‌సూన్‌ 100 రోజుల ప్రణాళికలో అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ మహిళలు, ఎన్‌జీవోలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, శానిటేషన్‌ వర్కర్స్‌ను భాగస్వామ్యం చేయడానికి నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ప్రచార పోస్టర్లు, ఆడియో, వీడియో రికార్డులను మున్సిపాలిటీలకు పంపారు. వంద రోజుల ప్రణాళికకు అవసరమైన వసతులను సమకూర్చడంపై దృష్టి సారించారు. మున్సిపాలిటీల వారీగా నోడల్‌ ఆఫీసర్లను నియామకం చేశారు.

అన్ని చర్యలు తీసుకుంటాం..

-బీఎస్‌ లత, అదనపు కలెక్టర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలలో వంద రోజుల ప్రణాళిక యాక్షన్‌ ప్లాన్‌ ఇప్పటికే సిద్ధం చేశాం. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే దానిపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశాం. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అంటురోగాలు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తాం.

Updated Date - Jun 02 , 2025 | 01:09 AM