ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముసురుతోనే సరి..

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:55 AM

అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రమంతటా జోరు వానలు కురుస్తుంటే జిల్లాలో మాత్రం ముసురుతోనే సరి పెట్టేస్తోంది. వాతావరణ శాఖ జిల్లాకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ప్రకటించినప్పటికీ తేలిక పాటి నుంచి మోస్తారు వర్షమే కురుస్తోంది.

-జూలైలో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే

-జిల్లాలో బావులు, బోర్ల కింద సాగు ముమ్మరం

-కాలువలు, చెరువులు ఆధారమైన ఆలస్యం

జగిత్యాల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రమంతటా జోరు వానలు కురుస్తుంటే జిల్లాలో మాత్రం ముసురుతోనే సరి పెట్టేస్తోంది. వాతావరణ శాఖ జిల్లాకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ప్రకటించినప్పటికీ తేలిక పాటి నుంచి మోస్తారు వర్షమే కురుస్తోంది. సీజన్‌ ప్రారంభంలో వరుణుడు ముఖం చాటేయడంతో ముందస్తుగా విత్తులు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతే వరి నారుమళ్లు ఎండిపోయాయి. పత్తి సాగుకు సమయం ముగిసిపోగా వరి నాట్లకు మరో వారం మిగిలి ఉన్నప్పటికీ సాగు అంచనాలో 50 శాతం దాటని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న ముసురుతో జిల్లా వ్యాప్తంగా నాట్లు ఊపందుకున్నాయి.

ఫఇప్పటి వరకు 1.57 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు..

జిల్లాలో వానాకాలంలో వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు, ఇతర పంటలు కలుపుకొని 4.15 లక్షల ఎకరాలల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 3.10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 32 వేల ఎకరాలు, పత్తి 10 వేల ఎకరాలు, పసుపు 8,500 ఎకరాల్లో, ఇతర పంటలు నిర్ణీత ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. సీజన్‌ ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేయడం, భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ఇప్పటి వరకు సుమారు 1.57 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు అయ్యాయి. ఇందులో వరి 1,00,120 ఎకరాలు, మొక్కజొన్న 30,140 ఎకరాలు, పత్తి 15 వేల ఎకరాలు, సోయాబిన్‌ 750 ఎకరాలు, కందులు 700 ఎకరాలు, పెసర 240 ఎకరాలు, అనుములు 190 ఎకరాలు, పసుపు 9,900 ఎకరాలు, మిరప 110 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తుఫాన్‌ ప్రభావంతో రైతులు ఆశగా వరి సాగు పనులను ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా జూలైలో సాధారణ వర్షపాతం 231.0 మి.మీ.లు కాగా ఇప్పటి వరకు 167 మి.మీ.లు మాత్రమే కురిసింది. జిల్లాలోని చాలా చెరువులు పూర్తి స్థాయిలో నీటితో నిండలేదు.

ఫసాగు ఆలస్యం..

వరి నాట్ల పనులు చివరి దశకు చేరుకోవాల్సి ఉండగా ప్రస్తుతం జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల దుక్కులు దున్నుతుండగా, మరికొన్ని చోట్ల అప్పటికే సిద్ధం చేసి ఉంచిన మళ్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు నాట్లు వేస్తున్నారు. బోరు బావులపై ఆధారపడి సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు పంటల్లో కలుపు తీయడం, గుంటుకలు కొట్టడం, ఎరువులు వేయడంలో రైతులు బిజీగా ఉన్నారు. వాతావరణ శాఖ ప్రకటించినట్లుగా వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. కాగా జిల్లాలో ఎస్సారెస్పీ కాలువల కింద 1,51,746 ఎకరాలు, చెరువుల కింద 1,91,161 ఎకరాలు, చిన్న నీటి వనరుల కింద 85,322 ఎకరాలు, వరద కాలువ 11,201 ఎకరాలు, మొత్తంగా 2,67,431 ఎకరాల ఆయకట్టు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో బావులు, బోరు బావులపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు.

ఫముదురుతున్న వరి నారు

జిల్లా వ్యాప్తంగా ప్రతి వానాకాలంలో సాధారణ అంచనా మేరకు 3.50 లక్షల మేరకు వరి సాగవుతోంది. జూన్‌ మొదటి, రెండో వారంలో నార్లు పోసుకున్న రైతుల్లో కొద్ది మంది మాత్రమే నాట్లు వేసుకోగా మిగితా వారు వేసిన వరి నార్లు ముదిరిపోతున్నాయి. జూన్‌ చివరి వారంలో నార్లు పోసుకున్న రైతుల పొలాలకు నీటి వసతి లేక, భారీ వర్షాలు కురవకపోవడంతో దున్నకాల పనులు నిలిచిపోతున్నాయి. జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత మేర ఊరటనిస్తున్నా పూర్తి స్థాయిలో లోటును తీర్చడం లేదు.

ఫజిల్లాలో నమోదైన వర్షపాతం..

జిల్లాలో ప్రస్తుత యేడాది ఏప్రిల్‌ మాసంలో 12.1 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 7.1 మి.మీ.లు మాత్రమే కురిసి లోటు వర్షపాతం నమోదైంది. మేలో 20.4 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా 180.2 మి.మీ.ల వర్షం కురిసింది. మేలో 783 శాతం అధిక వర్షం కురిసింది. జూన్‌లో 105.3 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా, 75.2 మి.మీ.ల వర్షం కురిసింది. జూన్‌లో 29 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత జూలైలో 25వ తేదీ వరకు 231.0 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా, 167మి.మీ.ల వర్షం కురిసింది. జూలైలో 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

----------------------------------------------------------------------------------

మండలం - సాధారణ వర్షపాతం...కురిసిన వర్షం(మి.మీ.లో)

----------------------------------------------------------------------------------

ఇబ్రహీంపట్నం - 240.2 - 143.5

మల్లాపూర్‌ - 231.1 - 198.3

రాయికల్‌ - 248.3 - 143.9

బీర్‌పూర్‌ - 236.0 - 218.3

సారంగపూర్‌ - 235.5 - 211.7

ధర్మపురి - 229.6 - 177.5

బుగ్గారం - 226.1 - 165.1

జగిత్యాల రూరల్‌ - 238.4 - 158.4

జగిత్యాల - 244.1 - 171.8

మేడిపల్లి - 212.9 - 186.4

కోరుట్ల - 233.3 - 127.3

మెట్‌పల్లి - 259.4 - 129.0

కథలాపూర్‌ - 253.5 - 122.9

కొడిమ్యాల - 190.6 - 153.0

మల్యాల - 200.7 - 152.0

పెగడపల్లి - 233.6 - 199.1

గొల్లపల్లి - 221.0 - 167.0

వెల్గటూరు - 234.8 - 166.6

ఎండపల్లి - 233.3 - 193.2

భీమారం - 212.7 - 153.0

----------------------------------------------------------------------------------

జిల్లా మొత్తం - 231.0 - 167.0

----------------------------------------------------------------------------------

Updated Date - Jul 26 , 2025 | 12:55 AM