సిరిసిల్లలో పనిచేయడం ఆనందంగా ఉంది
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:24 PM
సిరిసిల్లలో పనిచేయ డం ఆనందంగా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత అన్నారు.
సిరిసిల్ల క్రైం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో పనిచేయ డం ఆనందంగా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత అన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి గద్వాలకు బదిలీపై వెలుతున్న సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలతకు ఘనంగా వీడ్కో లు పలికారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవాదు లు బాధ్యతగా పనిచేసినపుడే గుర్తింపు లభిస్తుందన్నారు. ఇక్క డి న్యాయవాదులు వినమ్రతతో కూడుకున్న వ్యక్తులనీ, ధైర్యవం తులు, తెలివితేటలు గలవారన్నారు. సిరిసిల్ల టౌన్ నుంచి జిల్లా కోర్టు వేరొక చోటకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తే వెంట నే సీనియర్ న్యాయవాదులు హైకోర్టు వరకు వెళ్లి ఎక్కడికి తర లించకుండా చేశారన్నారు. వాస్తవానికి జిల్లా కోర్టు ప్రస్తుతం ఉన్న చోటే ఉంటే అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందన్నా రు. వచ్చే రెండు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయన్నారు. నూతన కోర్టు భవనాలతో పాటు న్యాయమూర్తులకు సైతం ఇక్కడే గృహసముదాయాలు ఏర్పాటు చేయడం వల్ల అధికారులకు పని సుల భమవుతుందన్నారు. తొలి పోస్టింగ్‌లోనే సిరిసిల్లలో మూడేళ్లు పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ప్రేమలతను అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, ప్రిన్సి పల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, 1వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సృజన, రెండవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివా సరావు, గుండ రవి, ప్రధాన కార్యదర్శులు వెంకటి, సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు సజ్జనం అనిల్‌కుమార్, మహిళా ప్రతినిధి పుష్పలత, లైబ్రరీ కార్యదర్శి శరత్‌రెడ్డి, క్యాషియర్ వేముల నరేశ్, సీనియర్, జూని యర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 11:25 PM