సీఎం ఫొటోలు ఉండాలని జీవో జారీ చేయండి..
ABN, Publish Date - May 29 , 2025 | 12:26 AM
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్యెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండాలని జీవోను తీసి అమలుచేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సవాలు విసిరారు.
సిరిసిల్ల టౌన్, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎమ్యెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండాలని జీవోను తీసి అమలుచేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సవాలు విసిరారు. బుధవారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులు చట్టాల ను, ప్రొటోకాల్స్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కేటీఆర్, ఆది శ్రీనివాస్ గెలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు ఎక్కువగా గెలిచినందున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆది శ్రీని వాస్ విప్‌గా నియమించిందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో విప్ గా ఆది శ్రీనివాస్ ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆ కార్యక్రమాల కు ఎన్నిసార్లు సిరిసిల్ల శాసన సభ్యుడు కేటీఆర్‌ను ఆహ్వానించారో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రొటోకాల్ పాటించకుండా కేటీఆర్ ఫొటో లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించారని ఆరోపిం చారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభి వృద్ధి పనులను మీరు చేసినట్లు కేటీఆర్ ఫొటోలు లేకుండా ప్రొటో కాల్ పాటించకుండా ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఎం ఐఎం ఎమ్యెలేల క్యాంప్ ఆఫీసుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో లు పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఎంపీగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్యాంప్ కార్యాలయాల్లో ప్రధాన మంత్రి ఫొటోలు పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, నాయకులు గుండారపు కృష్ణారెడ్డి, గెంట్యాల శ్రీనివాస్, నాగరాజు, శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్, రాజిరెడ్డి, ఉమారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 03:08 PM