ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:36 AM

అర్హులైన నిరుపే దలందరికి నూతన రేషన్‌కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగు తుందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అన్నారు.

సిరిసిల్ల రూరల్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన నిరుపే దలందరికి నూతన రేషన్‌కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగు తుందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల మున్సిప ల్‌ పరిధిలోని చంద్రంపేటలోని జిల్లా రైతు వేదికలో సోమవారం పలు వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులను కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేకే మహేందర్‌ రెడ్డితో కలిసి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో అర్హులైన 2610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్‌ కార్డులు జారీ చేస్తున్నమన్నారు. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మొత్తం 4527 మందిని అదనంగా చేర్చడం జరిగిందన్నారు. సిరి సిల్ల మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 21వేల రేషన్‌ కార్డుల లబ్ధిదా రులకు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రేషన్‌కార్డు చాలా కీలకమైన డ్యాకుమెంట్‌ అని, అధార్‌కార్డు, కరేంట్‌ కనెక్షన్‌, ప్రభుత్వ పథకాలు అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్‌కార్డు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో నూతనంగా 14వేల లబ్ధిదారులకు రేషన్‌ అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామన్నా రు. ప్రతి లబ్ధిదారుడు నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్‌ కార్డుల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్‌ వంటి అనేక సంక్షేమ పథకా లకు అర్హత వస్తుందన్నారు. రేషన్‌కార్డులను సద్వినియోగం చేసుకోవా లని పిలుపునిచ్చారు. ఇంకా కార్డులు రానివారు ఉంటే మీ సేవ కేంద్రా ల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియో జకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గంరఽథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, సిరిసిల్ల వ్యవసాయ మా ర్కెట్‌ కమిటి చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూప తిరుపతిరెడ్డి, సిరిసిల్ల అర్డీవో వెంకటేశ్వర్లు, పౌరసరపరాల శాఖ జిల్లా మేనేజర్‌ రజిత, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చోప్పదండి ప్రకాష్‌, నాయకులు గడ్డం నర్సయ్య, వె ల్ముల తిరుపతిరెడ్డి, భీమవరం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:36 AM