ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

ABN, Publish Date - Jul 20 , 2025 | 01:06 AM

నూతన రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, గడచిన పది సంవ త్సరాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కోనరావుపేట, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : నూతన రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, గడచిన పది సంవ త్సరాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండ లం ధర్మారం శ్రీనివాస గార్డెన్స్‌లో లబ్ధిదారులకు నూతన రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్‌ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందన్నారు. కోనరావుపేట మండలంలో 889నూతన రేషన్‌ కార్డులు జారీ చేస్తు న్నామని అన్నారు. గతంలో 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌చైర్మన్‌ తాళ్లపల్లి ప్రభాకర్‌, డిఎం సివిల్‌ సప్లై రజిత, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్‌ పాషా, జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, తహ సీల్దార్‌ విజయలక్ష్మి, కాంగ్రెస్‌ నాయకులు నాలుక సత్యం, భాస్కర్‌, శ్రీనివాస్‌, సదానందం, నందుగౌడ్‌, బాదినేని బాలరాజు, కె.బాల్‌రెడ్డి, ఉప్పుల గంగయ్య, బొడ్డు రమేష్‌, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలోని పెరిక కల్యాణ మండపంలో శనివారం నూతన రేషన్‌ కార్డులు లబ్ధిదారు లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్‌ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందన్నారు. మండలంలో 254 నూతన రేషన్‌ కార్డులు జారీ చేస్తున్నామని 1995మంది పేర్లను నూతనంగా నమోదు చేశామన్నారు. దాదాపు 2249 మంది పేదలకు అదనంగా రేషన్‌ అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీ డీవో రాధ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెల్కల తిరుపతి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బొజ్జ మల్లేశం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, మేడిపల్లి, చందుర్తి మండలాల ప్రజల కోరిక చందుర్తి-మోత్కూరురావుపేట రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభం చేయ డం జరుగుతుంది తెలిపారు.

రుద్రంగి : రాష్ట్రంలోని ఆర్హులైన పేదలంద రికీ ప్రజా ప్రభు త్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో శనివారం నూతన రేషన్‌కార్డులను పంపీణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతి థిగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ హాజరై లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను పంపీణీ చేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరు పతి, తహసీల్దార్‌ పుష్పలత, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు తూం జలపతి, గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్‌ తర్రె ప్రభలత మనోహర్‌, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, మాడిశెట్టి అభిలాష్‌, కెసి రెడ్డి నర్సరెడ్డి, తర్రె లింగం, బైరి గంగ మల్లయ్య, సూర యాదయ్య, గండి ఆశోక్‌, దయ్యాల శ్రీనివాస్‌, ఎర్రం రాజలింగం, చెలుకల శ్రీ కాంత్‌, ద్యవాల దీలీప్‌, ఎర్రం ఆరవింద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 01:06 AM