ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు..

ABN, Publish Date - May 16 , 2025 | 12:11 AM

మారు మూల పల్లెలో కూలీలకు పని కల్పించాల్సిన పథకంలో ఆన్‌లైన్‌ హాజరు నమోదులో కూలీ ల ఫొటోలకు బదులు మొక్కల ఫొటోలను నమోదుచేస్తున్నారు.

వీర్నపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): మారు మూల పల్లెలో కూలీలకు పని కల్పించాల్సిన పథకంలో ఆన్‌లైన్‌ హాజరు నమోదులో కూలీ ల ఫొటోలకు బదులు మొక్కల ఫొటోలను నమోదుచేస్తున్నారు. అలా నమోదైన ఉపాధి డబ్బులను పనిచేయని వారి పేరిట ఖాతాల్లో వేస్తున్నారని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాకు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. ఇదే విషయంపై ఈజీఎస్‌ ఏపీడీ నర్సింహులు వీర్నపల్లి మండలం బంజేరు, సీతా రాంనాయక్‌ తండా గ్రామాల్లో గురువారం వివరాలు సేకరిం చారు. ఫిర్యాదు అందిన కూలీలను విచారణ చేయగా సమాధానాలు చెప్పడంలో తడబడ్డారు. కొంతమంది కూలీ లు తమను సమావేశానికి పిలవకుండానే కావలసిన వారిని తీసుకె ళ్తున్నారంటే ఆరోపించారు. మండల స్థాయి అధికారుల తప్పిదాల ను కప్పిపుచ్చుకోవడానికి నామమాత్రంగానే విచారణ చేశారని పలువురు ఆరోపించారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ఆన్‌లైన్‌ నమోదులో పనిచేసిన వారి గ్రూప్‌ ఫొటోలు నమోదు చేయాల్సిన వాటిలో మొక్కల ఫొటోలను నమోదు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. మండలానికి టెక్నికల్‌ అసిస్టెంట్‌లు లేకపోవడంతో సొంత మండలానికి చెందిన వారే ఇన్‌చార్జ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ లుగా పనిచేయడంపై ఉపాధి కూలీలు అసహనం వ్యక్తం చేస్తున్నా రు. ఈ సందర్భంగా ఏపీడీ నర్సింహులు మాట్లాడుతూ ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేసి రికార్డులను పరిశీలిస్తామన్నారు. పని ప్రదేశంలో వంద మందికి ఒక మేటు ఉండాలని సూచించారు. నివేదికను కలెక్టర్‌కు అందజేసి బాధ్యు లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఏపీవో శ్రీహరి, ఇన్‌చార్జ్‌ టెక్నికల్‌ అసిస్టెం ట్‌లు అనిత, గంగాధర్‌, ఫీల్డ్‌అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:11 AM