హక్కుల సాధనకు ఐఎన్‌టీయూసీ కృషి
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:47 AM
కార్మికుల హక్కుల సాధనకు ఐఎన్‌టీయూసీ రాజీలేని పోరాటం చేస్తున్నదని యూనియన్ జాతీయ సీనియర్ కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాబర్ సలీంపాషా తెలిపారు.
- ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీంపాషా
జ్యోతినగర్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కార్మికుల హక్కుల సాధనకు ఐఎన్‌టీయూసీ రాజీలేని పోరాటం చేస్తున్నదని యూనియన్ జాతీయ సీనియర్ కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాబర్ సలీంపాషా తెలిపారు. శుక్రవారం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబర్ మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపు పొందిన ఐఎన్‌టీయూసీ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తున్నదన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఐఎన్‌టీయూసీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు. నూతన కార్యవర్గం జిల్లాలో అన్నివర్గాల కార్మికుల డిమాండ్ల సాధనకు కృషి చేస్తుందన్నారు. ప్రధానంగా ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎప్‌సీఎల్‌తోపాటు అసంఘటిత రంగంలోని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, బీడీ కార్మికులు తదితర కార్మికుల కోసం పనిచేస్తుందన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెకు జిల్లా ఐఎన్‌టీయూసీ ఆద్వర్యంలో అన్ని యూనియన్లతో సమన్వయం చేసుకొని సమ్మె విజయవంతానికి కృషి చేస్తామని బాబర్ తెలిపారు. సమావేశంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బూమళ్ల చందర్, ప్రధాన కార్యదర్శి విజయ్ మోహన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఐఎన్‌టీయూసీ పెద్దపల్లి జిల్లా కమిటీ..
ఐఎన్‌టీయూసీ పెద్దపల్లి జిల్లా కార్యవర్గాన్ని యూనియన్ జాతీయ కార్యదర్శి బాబర్ సలీంపాషా సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బూమళ్ల చందర్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ మోహన్, ఉపాధ్యక్షులుగా నీరటి శంకర్, మేకల సతీష్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీలుగా కుల్ల వెంకటేశ్వర్లు, కనకయ్య, జునుతుల సమ్మిరెడ్డి, కొమరయ్య, కోశాధికారిగా సురేందర్, జాయింట్ సెక్రెటరీలుగా నయీం పాషా, బొద్దున శీనివాస్, ఎండీ జమీల్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
Updated Date - Apr 26 , 2025 | 12:47 AM