బీమాతో ధీమా
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:55 AM
భూతల్లిని నమ్ముకుని కుటుంబాన్ని నడిపిస్తున్న రైతు ఇంటి పెద్దగా ఉండి ఆకస్మికంగా చనిపోతే కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. రైతు కుటుంబం వీధిన పడకుండా రైతు సంక్షేమం కోసం గత ప్రభుత్వ హయాంలో 2018లో తీసుకువచ్చిన రైతు బీమా పథకం అన్నదాతకు అండగా నిలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా రైతులకు భీమా సదుపాయం కల్పిస్తోంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
భూతల్లిని నమ్ముకుని కుటుంబాన్ని నడిపిస్తున్న రైతు ఇంటి పెద్దగా ఉండి ఆకస్మికంగా చనిపోతే కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. రైతు కుటుంబం వీధిన పడకుండా రైతు సంక్షేమం కోసం గత ప్రభుత్వ హయాంలో 2018లో తీసుకువచ్చిన రైతు బీమా పథకం అన్నదాతకు అండగా నిలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా రైతులకు భీమా సదుపాయం కల్పిస్తోంది. బీమాలో చేరిన రైతులకు ఆగస్టు 14 నుంచి తర్వాత సంవత్సరం ఆగస్టు 13 వరకు బీమా అమల్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రెన్యూవల్ చేస్తుంది. దీంతో పాటు ప్రతి సంవత్సరం జూలై 30 వరకు కొత్త పట్టాదారులకు బీమాలో చేరే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల వయస్సు వరకు రైతులు భీమా పథకంలో అర్హులుగా నమోదు చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024- 25 సంవత్సరంలో 80వేల 185 మంది రైతులు బీమా పథకంలో చేరారు. బీమాలో చేరిన రైతు చనిపోతే సంబంధిత పత్రాలు వ్యవసాయ అధికారికి అందజేస్తే వారు క్లెయిమ్ కోసం బీమా కంపెనీకి పంపుతారు. ఇన్సూరెన్ప్ కంపెనీ నుంచి బీమా పరిహారం రైతుకు సంబంధించిన నామిని ఖాతాలో జమ చేస్తారు.
జిల్లాలో రూ.133.75 కోట్ల బీమా పరిహారం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు రైతు బీమా పథకంలో అమలులో ఉన్నది. 2024-25 సంవత్సరంలో 80,185 మంది రైతులు నమోదయ్యారు. ఈ సారి కొత్తగా 6 వేల మంది రైతులు నమోదయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు రైతు బీమా ద్వారా 2,675 మంది రైతు కుటుంబాలు పరిహారం పొందారు. 2018లో 318 మంది, 2019లో 337 మంది, 2020లో 536 మంది, 2021లో 387 మంది, 2022లో 376మంది, 2023లో 385 మంది,2 2024లో 336 మంది రైతులు చనిపోగా వారి కుటుంబాలు బీమా సాయం పొందారు. ఇప్పటివరకు రూ. 133.75 కోట్ల వరకు బీమా పరిహారం పొందారు. కొత్తగా బీమా దరఖాస్తులు చేసుకునే విధంగా వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పించనుంది.
Updated Date - Jul 12 , 2025 | 12:55 AM