ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్పీకర్‌ను అవమానించడం హేయమైన చర్య

ABN, Publish Date - Mar 17 , 2025 | 01:08 AM

శాసననభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకురాలా ఖబద్దార్‌ అంటూ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీ నివాస్‌ బీఆర్‌ఎస్‌ నాయకులపై ఘాటు వ్యాఖ్యలుచేశారు.

వేములవాడ టౌన్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : శాసననభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకురాలా ఖబద్దార్‌ అంటూ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీ నివాస్‌ బీఆర్‌ఎస్‌ నాయకులపై ఘాటు వ్యాఖ్యలుచేశారు. శాసన సభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కు నిరసనగా వేములవాడ ము న్సిపల్‌ పరిధాలోని తిప్పాపూర్‌ ఆర్టీసీ బస్టాండు ముందు జగదీ శ్వర్‌రెడ్డి, కేటీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా వీచ్చేసిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మా ట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీలోని నాయకులైన జగ దీశ్వర్‌రెడ్డి, కేటీఆర్‌ మాట్లాడే మాటలు అహంకా రపూరితమైనవన్నారు. వాళ్లకు గవర్నర్‌ అంటే గౌరవం లేదని, స్పీకర్‌ అంటే లెక్కలేదని విమ ర్శించారు. మంత్రులుగా పని చేసిన అనుభవం ఉండి రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన వారు స్పీకర్‌ చైర్‌ను అవమానపరచడం హేయ మైన చర్యని మండిపడ్డారు. దళితబిడ్డ అయిన స్పీకర్‌ను అవమాన పరచడంతో యావత్‌ దేశం తెలంగాణ వైపు చూసి నివ్వెరపోయిందని అన్నా రు. గవర్నర్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి ధన్యవా దాలు తెలుపాలని కోరితే దౌర్జన్యంగా వ్యవహ రించారని, జగదీశ్వర్‌రెడ్డి అనే మూర్కుడు మా ట్లాడిన మాటలు తప్పు కాదు అన్నట్లు కేటీఆర్‌ అతన్ని సమర్థించడం సిగ్గుచేటు అని అన్నారు. ఇప్పటికే తామే అధికారంలో ఉన్నామనే భ్రమ లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసు కువెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తే అడ్డుకుంటున్నారన్నారు. నాయకులు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు, వైస్‌చైర్మన్‌ కనిక రపు రాకేష్‌, నాయకులు ఇప్పపూల అజయ్‌, కూరగాయల కొమురయ్య, సాగరం వెంకటస్వామి, సంద్రగిరి శ్రీనివాస్‌, వకులభరణం శ్రీనివాస్‌, తూం మదు, నాగుల విష్ణు, అరుణ్‌తేజాచారీ, అంబటి చంద్రశేఖర్‌యాదవ్‌ ఉన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 01:08 AM