ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సోలార్‌ సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:30 PM

పట్టణంలో సోలార్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం అన్నారు. మంగళవారం జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌ను సీపీ తనిఖీ చేశారు. హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి, సీఐ ఎస్‌ రామకృష్ణగౌడ్‌ ఆయనకు పూల మొక్కలు ఆందజేసి స్వాగతం పలికారు.

సోలార్‌ సీసీ కెమరాలు ప్రారంభిస్తున్న పోలీస్‌ కమిషనర్‌.

జమ్మికుంట, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో సోలార్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం అన్నారు. మంగళవారం జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌ను సీపీ తనిఖీ చేశారు. హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి, సీఐ ఎస్‌ రామకృష్ణగౌడ్‌ ఆయనకు పూల మొక్కలు ఆందజేసి స్వాగతం పలికారు. పరేడ్‌ను పర్యవేక్షించి, పరిసరాలను పరిశీలించారు. అనంతరం పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్‌ సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో పని చేయని సీసీ కెమరాలు గుర్తించి, వాటి స్థానంలో అధునాతనమైన కెమరాలు ఏర్పాటు చేయడం మంచి విషయం అన్నారు. భవిష్యత్తులో మండల వ్యాప్తంగా సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్‌ ఇండెక్స్‌ పరిశీలించి పెండింగ్‌ కేసులు, సైబర్‌ నేరాల గురించి తెలుసుకుని వాటిపై సమీక్ష జరిపినట్లు తెలిపారు. విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లు, సబ్‌ సెక్టార్లుగా విభజించి, ప్రత్యేక గ్రామ పోలీస్‌ అధికారులను కేటాయించాలని ఆదేశించారు. నూతన కానిస్టేబుళ్లు అన్ని రకాల విధులు సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, హీస్టరీ షీటర్లపై నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికిప్పుడు గమనించాలన్నారు. పోలీస్‌ సిబ్బందికి అందించిన కిట్లు, రెయిన్‌ జాకెట్లను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.

ఫ పోలీస్‌ స్టేషన్ల తనిఖీ

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల మంగళవారం సీపీ గౌస్‌ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లలోని రికార్డులు, పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, టౌన్‌ సీఐ కరుణాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:30 PM