ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి

ABN, Publish Date - Jul 18 , 2025 | 01:05 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పిలుపునిచ్చారు.

చందుర్తి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పిలుపునిచ్చారు. చందుర్తి మండలంలోని రామారావు పల్లె గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్‌ గురువారం పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువగా తిరగడం గమనించిన కలెక్టర్‌ వాటిని నియంత్రించాలని పంచాయతీ సెక్రెటరీ, అధికా రులకు ఆదేశించారు. గ్రామాల్లో నిత్యం పారిశుధ్య పనులు నిర్వహించాల న్నారు. సనుగుల గ్రామపంచాయతీ పరిధిలో రహదారుల వెంట ఇరువైపు లా గడ్డి, పిచ్చిమొక్కలు పెరగడం, వర్షపునీరు నిలిచి ఉండడాన్ని గమనించి వాటిని తొలగించాలని సూచించారు. గ్రామంలో అవసరమైన చోట్ల సీసీరోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నిత్యం పారిశుధ్య పనులు చేయించాలని, నీరు నిలవకుండా చర్య లు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Jul 18 , 2025 | 01:05 AM