ఇసుక కొరతతో నిలిచిపోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:53 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోతున్నాయని, దీన్ని ఆసరా చేసుకొ ని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్న అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోతున్నాయని, దీన్ని ఆసరా చేసుకొ ని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్న అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ మాట్లాడారు. ఇళ్లు లేకుండా స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ పథకంలో ఇళ్లను మంజూరుచేసి నిర్మాణాలకు రూ.5లక్షలు మంజూరు చేయడంతో సిరిసిల్ల పట్టణంలో 700లకు పైచిలుకు ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ అనుమతుల పత్రాలను అందించారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఓకేసారి నిర్మాణా లను ప్రారంభించడంతో సిరిసిల్లలో ఇసుక కొరత ఏర్పడింద న్నారు. ఇసుక లేక నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. దీనికి అసరగా చేసుకున్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు అక్రమదారులు ఇసుక ట్రాక్టర్‌కు 3వేల రూపాయల నుంచి 4వేల రూపాయల వరకు పెంచడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయడంతో పాటు వారంలో మూడురోజులు ఇసు కకు వేబిల్లులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్న అక్రమదారులపై కలెక్టర్ కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఎం కార్యదర్శి వర్గసభ్యులు కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, మాల్లారం ప్రశాంత్, మిట్టపల్లి రాజమౌళి తదితరలు పాల్గొన్నారు.
Updated Date - Jun 11 , 2025 | 12:53 AM