‘ఇందిరా మహిళా శక్తి’ ఆత్మవిశ్వాసానికి ఒక ప్రేరణ
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:26 AM
ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆత్మవిశ్వాసానికి ఒక ప్రేరణ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆత్మవిశ్వాసానికి ఒక ప్రేరణ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బుధవారం శుభోదయ గ్రామైక్య సం ఘం ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల దుకాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయా లనే సంకల్పంతో ముందుకుపోతున్నారని తెలిపారు. అం దులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళాశక్తి పథకాన్ని ప్రారంభించారన్నారు. తద్వారా మహిళలకు వడ్డీ లేని రు ణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిది ద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారన్నారు.గత ప్రభుత్వం మహిళా సంఘంలను పట్టించుకోలేదని చివరికి మూడు సంవత్సరాల వడ్డీని ఎగ్గొట్టినట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొను గోలు, రైస్‌మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇందిర మ్మ ఇళ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని తెలిపారు. చందుర్తి మండలం రాజకీయంగా ఎంతో తోడ్పాటున అందించిందని తెలిపారు. నర్సింగాపూర్ గ్రామానికి 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేయించానని దానితోపాటు నియోజకవర్గ పరిధి లో 10 సబ్ స్టేషన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ ద్వారా 84 కోట్లు, 2025-26 సంవత్సరానికి 58 కోట్లు బ్యాంకు లింకేజీ అందజేయడం జరిగిందని తెలిపారు. 4350 సంఘాలకు 5కోట్ల 72 లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేశామన్నారు. మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రా రంభించిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం కింద రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది ప్రయాణించారని తద్వారా 6680 మేర కోట్లు మహిళలకు ఆదా అయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో ఏపీఎం రజిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, ఏఎంసీ వైస్‌చైర్మన్ బోజ్జ మల్లేశం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, నాయకులు ఇల్లంతకుంట గణేష్, గొట్టే ప్రభాకర్, పులి సత్తయ్య, మ్యాకల గణేష్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 02:26 AM